రాజ్ తరుణ్ కొత్త సినిమా టైటిల్ ఏంటో తెలుసా !

22nd, October 2017 - 02:55:40 PM

యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో ఒక సినిమాను చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఈ మంగళవారం ప్రారంభంకానుంది. చాన్నాళ్ల నుండి అనుకుంటున్నా కొన్ని కారణాల వలన ఆలస్యమైన ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు ఇప్పుడు కుదిరింది. ‘అలా ఎలా’ ఫేమ్ అనీష్ క్రిష్ణ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. హిట్టవుతుందని నమ్మకముంటే తప్ప ప్రాజెక్ట్ మొదలుపెట్టని దిల్ రాజు చేస్తుండంతో ఈ సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉంటుందని తెలుస్తోంది. ఈ ప్రేమ కథకు ‘లవర్’ అనే టైటిల్ అనుకుంటున్నారట. అయితే ఈ టైటిల్ ఎంతవరకు ఖచ్చితమైందో తెలియాలంటే మంగళవారం జరగబోయే మూవీ లాంచింగ్ వరకు వేచి ఉండాల్సిందే. ఇకపోతే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు, ఇతర తారాగణం, సాంకేతిక నిపుణులు ఎవరు అనే వివరాలు కూడా ఆరోజే తెలిసే అవకాశముంది.