హిట్ కాంబినేషన్స్ లో వెరీ ఇంట్రస్టింగ్ టైటిల్ !

Published on Jul 10, 2019 3:01 am IST

నాగసౌర్య, మాళవిక నాయర్ జంటగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ఓ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా టైటిల్ ను నాగశౌర్య రివీల్ చేశాడు. దర్శకుడు శ్రీనివాస్ అవసరాల ఈ సినిమాకి ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’ అని టైటిల్ పెట్టినట్లు తెలిపాడు. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ కూడా అయిపోయాయి అట. వచ్చే నెల లో మూడో షెడ్యూల్ ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది.

ఇక ‘కళ్యాణ వైభోగమే’లో నాగసౌర్య – మాళవిక నాయర్ జంటగా నటించి ఆ సినిమాతో మంచి విజయం అందుకున్నారు. అలాగే ‘నాగసౌర్య – అవసరాల శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన ఊహలు గుస గుస లాడే, జో అచ్యుతానంద చిత్రాల కూడా మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు ఈ హిట్ కాంబినేషన్స్ లో మళ్లీ కొత్త లవ్ స్టోరీతో ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’ రాబోతుంది.

ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు ‘దాసరి ప్రొడక్షన్స్’ పై టి.జి.విశ్వప్రసాద్, దాసరి పద్మజ కలసి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శౌర్య అశ్వద్ధామ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే త్వరలో సుబ్రమణ్యపురం డైరక్టర్ సంతోష్ దర్శకత్వంలో ‘పార్థు’ అనే టైటిల్ తో మరో సినిమా కూడా మొదలు పెట్టబోతున్నట్లు చెప్పాడు.

సంబంధిత సమాచారం :

X
More