తేజ్ భలే టైటిల్ పట్టాడే !

Published on Jun 4, 2019 4:59 pm IST

మెగాహీరో సాయి తేజ్ ‘చిత్రలహరి’ విజయంతో వరుస పరాజయాల నుండి కాస్త కోలుకున్నారు. ఇన్నాళ్లు తేజ్ స్టోరీ సెలెక్షన్ పట్ల విముఖత వ్యక్తం చేసిన ప్రేక్షకులు చిత్రలహరి చూశాక తేజ్ ఎట్టకేలకు ట్రాక్ మార్చాడని మెచ్చుకున్నారు. దీంతో తేజ్ ఇదే పద్దతిని కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్రమంలోనే మారుతి దర్శకత్వంలో ఒక సినిమాకి సైన్ చేశాడు.

త్వరలోనే సినిమా ఆరంభంకానుంది. తాజా సమాచారం మేరకు ఈ చిత్రానికి ‘భోగి’ అనే టైటిల్ అనుకుంటున్నారట. భోగి అనే టైటిల్‌లో అనేక అర్థాలున్నాయి. ఇలాంటి టైటిల్ పెడుతున్నారంటే సినిమా మాంచి మసాలా సబ్జెక్ట్ అయినా అయ్యుండాలి లేకపోతే సందేశమిచ్చే కథ అయినా అయ్యుండాలి. గీతా ఆర్ట్స్ 2, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక శర్మను కథానాయకిగా తీసుకునే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు.

సంబంధిత సమాచారం :

More