సుమంత్ సినిమా టైటిల్ భలే వెరైటీగా ఉందే..!

sumanth
అక్కినేని నట వారసుల్లో మూడో తరం నటుడిగా వెండి తెరకు ముందుగా పరిచయమైన హీరో ‘సుమంత్’. కెరీర్ ఆరంభంలో పరవాలేదనిపించిన ఈ హీరో మెల్లగా కెరీర్ గ్రాఫ్ ను కోల్పోయి గత రెండేళ్లుగా ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చేయలేకపోయాడు. ప్రస్తుతం సుమంత్ బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచినా ‘విక్కీ డోనార్’ అనే చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేస్తున్నాడు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా సైలెంట్ గా జరుగుతున్నాయి. నూతన దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పల్లవి సుభాష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి తెలుగులో ‘నరుడా డోనరుడా’ అన్న వెరైటీ టైటిల్ ను ఖాయం చేసినట్లు తెలుస్తోంది. వీర్య కణాల దానం అనే ప్రయోగాత్మక కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ బాలీవుడ్ చిత్రం భారీ విజయాన్ని సాధించగా తెలుగు ప్రేక్షకులు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.