
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం విలక్షణ దర్శకుడు సుకుమార్‌తో నాన్నకు ప్రేమతో అనే సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత తాను నటించబోయే మరో సినిమాకు కూడా ఎన్టీఆర్ ఇప్పటికే రంగం సిద్ధం చేసేశారు. మిర్చి, శ్రీమంతుడు సినిమాలతో టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయిన దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ తదుపరి సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. శ్రీమంతుడుతో బ్లాక్‌బస్టర్ అందించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాను అక్టోబర్ 25వ తేదీన అధికారికంగా లాంచ్ చేసేందుకు సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది.
ఇక ఈ సినిమా టైటిల్ విషయమై తాజాగా ఓ ఆసక్తికర విషయం హల్‌చల్ చేస్తోంది. ఎన్టీఆర్-కొరటాల శివ సినిమాకు ‘జనతా గ్యారేజ్’ అనే ఆసక్తికర టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఇచ్చట అన్నీ రిపేర్ చేయబడును’ అన్నది ట్యాగ్‌లైన్‌గా తెలుస్తోంది. కాగా ఈ విషయమై సినిమా యూనిట్ నుంచి ఇంకా ఎలాంటి అనౌన్స్‌మెంట్ రాలేదు. సినిమా లాంచ్ రోజునే టైటిల్‌ను కూడా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇక తన మొదటి రెండు సినిమాల్లోనూ బలమైన కాన్సెప్ట్‌కు తన మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి మెప్పించినట్లుగానే ఎన్టీఆర్ సినిమాకూ కొరటాల ఇదే తరహాలో వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. నాన్నకు ప్రేమతో పూర్తయ్యాక ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుంది.

