లోకల్ గ్యాంగ్స్టర్ లండన్ వెళ్లి రఫ్ఫాడిస్తే

Published on Jun 2, 2021 12:42 am IST

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నాడు హీరో ధనుష్. ఆయన గత రెండు చిత్రాలు ‘అసురన్, కర్ణన్’ తమిళనాట ఈ చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఆ పంథాలోనే ధనుష్ చేసిన మరొక వైవిధ్యమైన చిత్రం ‘జగమే తంతిరం’. తెలుగులో ‘జగన్ తంత్రం’ పేరుతో ఈ సినిమా విడుదలకానుంది. కార్తిక్ సుబ్బారాజ్ ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ చిత్రాన్ని ఓటీటీ వేదికగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది.

ఈ నెల 18వ తేదీన రిలీజ్ కానుంది. అందుకే ఈరోజు ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే ఇదొక గ్యాంగ్స్టర్ సినిమా అని ఇట్టే అర్థమవుతుంది. గతంలో ఇలాంటి సినిమాలే చాలా వచ్చినా ఇది మాత్రం డిఫరెంట్. లోకల్ తమిళ గ్యాంగ్స్టర్ లండన్ వెళ్లి అక్కడి ముఠాలతో తలపడితే ఎలా ఉంటుంది అనేదే కథ. దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ సినిమాలో అథెంటిక్ థీమ్ ఉట్టిపడేలా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. చూడబోతే సినిమాలో ఏదో మ్యాజిక్ ఉందని అర్థమవుతోంది. మరి ఆ మ్యాజిక్ ఏంటో చూడాలంటే 18వ తేదీ వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :