సంక్రాంతి సెంటిమెంట్ బ్రేక్ చేయనున్న బాలయ్య…?

Published on Oct 7, 2019 10:13 am IST

టాలీవుడ్ హీరోలలో బాలకృష్ణకు సంక్రాంతి హీరో అని పేరుంది. సమరసింహారెడ్డి,నరసింహనాయుడు, లక్ష్మీ నరసింహ వంటి అల్ టైం బ్లాక్ బస్టర్ మూవీస్ సంక్రాంతి కానుకగా విడుదలైనవే. అందుకే బాలకృష్ణ ప్రతి సంక్రాంతికి ఒక మూవీ విడుదలయ్యేలా చూసుకుంటారు. బాలయ్య కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేస్తున్న తాజా చిత్రం మాత్రం సంక్రాంతికి రావడంలేదు. సాంప్రదాయానికి భిన్నంగా బాలయ్య ఈ చిత్రాన్ని సంక్రాంతికి ముందే విడుదల చేయనున్నారని తాజా సమాచారం.

బాలయ్య 105వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల చేయనున్నారట. సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదిక నటిస్తుండగా, భూమిక చావ్లా, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ మూవీ విడుదల తేదీ అధికారికంగా త్వరలో రానుంది.

సంబంధిత సమాచారం :

More