రణబీర్ కపూర్ – ఆలియా భట్ జంటగా నటించిన భారీ సినిమా బ్రహ్మాస్త్ర. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. ఐతే, బ్రహ్మాస్త్ర 2 ని ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో బ్రహ్మాస్త్ర 2 లో ఎన్టీఆర్ ప్రధాన పాత్ర పోషించబోతున్నట్లు కొత్తగా పుకార్లు వైరల్ అవుతున్నాయి. రణబీర్ కపూర్ – ఆలియా భట్ లతో పాటు ఎన్టీఆర్ ఓ పార్టీలో కనిపించడంతో ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది.
కానీ, మేకర్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. బ్రహ్మాస్త్ర 2 ఎన్టీఆర్ నటించడం లేదు. రణబీర్ కపూర్ – ఆలియా భట్ కలయికలోనే బ్రహ్మాస్త్ర 2 రాబోతుంది. వచ్చే ఏడాది బ్రహ్మాస్త్ర 2 స్టార్ట్ అవుతుందట. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతానికి వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు. అలాగే, ఈ సినిమాతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమా ‘దేవర పార్ట్ 1’లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. అక్టోబర్ 10న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.