చైతు ఇంట్రెస్టింగ్ సినిమాపై లేటెస్ట్ అప్డేట్.!

Published on Apr 24, 2021 9:00 am IST

అక్కినేని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “లవ్ స్టోరీ” ఆల్రెడీ షూట్ అంతా కంప్లీట్ అయ్యిపోయి రిలీజ్ కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి అలాగే ఈ చిత్రం అనంతరం తమ కుటుంబానికి మంచి ఆప్తుడిగా మారిన టాలెంటెడ్ దర్శకుడు విక్రమ్ కె కుమార్ తో “థ్యాంక్ యు ది మూవీ” అనే సినిమాను కూడా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే కొన్నాళ్ల కితమే స్టార్ట్ అయిన ఈ చిత్రం నెక్స్ట్ షెడ్యూల్ పై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. ఈసారి మేకర్స్ ఇటలీలో షూట్ ను ప్లాన్ చేశారట ఇందులో చైతుతో పాటుగా హీరోయిన్ రాశీ ఖన్నా కూడా నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ చిత్రంలో నాగ చైతన్య సూపర్ స్టార్ మహేష్ బాబుకి కల్ట్ ఫ్యాన్ గా కనిపించనుండమే కాకుండా ఓ స్పోర్ట్స్ మెన్ గా కూడా కనిపిస్తాడని తెలుస్తుంది. అలాగే ఈ ఇంట్రెస్టింగ్ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :