చాందిని చౌదరి హీరోయిన్ గా చాలా కాలంగా నటిస్తోన్నా హీరోయిన్ గా ఇప్పటికీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు. అయితే ఆమె నటించిన సినిమాల్లో కాస్త పేరు వచ్చిన సినిమా అంటే.. ఈ మధ్య వచ్చిన “కలర్ ఫోటో” సినిమానే. ఈ సినిమా డైరెక్ట్ గా డిజిటల్ ఆప్ లో రిలీజ్ అయి.. నెటిజన్లను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా చాందిని చౌదరికి మంచి పేరు వచ్చింది. ఈ క్రమంలో కొన్ని ఆఫర్లు కూడా వచ్చాయి చాందినికి.
అయితే, చాందిని నటించిన మరో మూవీ… “బొంబాట్” అనే సినిమా అమెజాన్లో విడుదలై బ్యాడ్ టాక్ తెచ్చుకోవడం.. ఆ సినిమాలో నటించినందుకు చాందినికి పెద్ద మైనస్ అయింది. పైగా చాందిని నటన, ఎక్స్ ప్రెషన్లు కూడా బాగాలేదు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చాందిని మంచి నటి అయినా.. ఎందుకు ఇలా నటించింది అంటూ ఆమె యాక్టింగ్ పై విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి ఈ సినిమా రిజల్ట్ తో చాందినికి ఉన్న పేరు మొత్తం పోయేలా ఉంది.


