కె జి ఎఫ్ క్లైమాక్స్ అదే, గూస్ బంప్స్ గ్యారంటీ..?

Published on Apr 4, 2020 9:04 am IST

2018లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ హీరో యష్ తో కలిసి ప్రభంజనం సృష్టించారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన కెజిఎఫ్ భారీ విజయం అందుకుంది. విడుదలైన అన్ని ప్రధాన భాషలలో ఈ మూవీ హిట్ కావడం విశేషం. ఇక ఈ చిత్రానికి కొనసాగింపుగా కెజిఎఫ్ చాప్టర్ 2 రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ మూవీ 2020 అక్టోబర్ 23న భారీగా విడుదల కానుంది. ఐతే కెజిఎఫ్ చాప్టర్ 2 క్లైమాక్స్ విషయంలో ఓ ఆసక్తికర వార్త బయటికి వచ్చింది.

ఈ మూవీలో సంజయ్ దత్ ప్రధాన విలన్ అధీరా రోల్ చేస్తుండగా బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ దేశ ప్రధాని రోల్ చేస్తున్నారు. ఆమె పాత్ర నెగెటివి షేడ్స్ కలిగి ఉంటుందని రవీనా స్వయంగా చెప్పడం జరిగింది. కాగా కెజిఎఫ్ 2 లో రాఖి భాయ్ నిర్మించుకున్న సామ్రాజ్యం కూల్చేయడమే కాకుండా అతని మరణానికి కూడా ఆమె కారణం అవుతుందట. ప్రత్యర్థులను చంపివేసి కెజిఎఫ్ కి కింగ్ గాఎదిగిన రాఖీని ప్రభుత్వ సైన్యం సహకారంతో రవీనా టాండన్ చంపించి వేస్తుందని తెలుస్తుంది. అమ్మ మాట ప్రకారం రాఖి రాజు హోదాలో ఆనందంగా చనిపోతాడని టాక్. కె జి ఎఫ్ 2 క్లైమాస్స్ లో రాఖీ భాయ్ చనిపోతాడని వినికిడి. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందొ తెలియాలంటే, అక్టోబర్ వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :

X
More