మహేశ్ బాబు సినిమాలో విజయశాంతి !

Published on Mar 10, 2019 9:58 am IST

అనిల్ రావిపూడి తన తరువాత సినిమాను మహేశ్ బాబుతో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం అప్ డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మహేష్ అభిమానులు. కాగా జూలై నుండి ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తోంది.

అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారట, అలాగే కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా ఓ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక మహేశ్ సరసన సెన్సేషనల్ హీరోయిన్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోందని ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు.

కాగా కామెడీని హ్యాండిల్ చేయడంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి, ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా హ్యాట్రిక్ విజయాలను నమోదు చేస్తోన్న డైరెక్టర్. డైలాగ్ రైటర్ గా కెరీర్ మొదలు పెట్టి .. సక్సెస్ ఫుల్ సినిమాల డైరెక్టర్ గా ఎదిగాడు. ఇటీవలే ‘ఎఫ్ 2’తో భారీ హిట్ ను కొట్టాడు అనిల్.

ఇప్పుడు ఏకంగా మహేశ్ బాబును డైరెక్ట్ చెయ్యబోతున్నాడు. మరి మహేశ్ తో కూడా హిట్ కొడతాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More