మరో యంగ్ డైరెక్టర్ తో మహేష్.. నిజమేనా ?

మరో యంగ్ డైరెక్టర్ తో మహేష్.. నిజమేనా ?

Published on Dec 6, 2020 11:39 PM IST

Mahesh 1
భీష్మ సినిమాతో తన ఖాతాలో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాడు వెంకీ కుడుముల. అయితే తాజాగా వెంకీ కుడుముల మహేష్ ని కలిసి ఓ కథ వినిపించారని.. వెంకీ చెప్పిన కథ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ పట్ల మహేష్ కూడా సానుకూలంగా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా ఇలాగే వచ్చాయి. ఇప్పుడు మళ్లీ ఈ వార్తే రావడంతో ఈ సినిమా పై అందరిలో నమ్మకం ఏర్పడింది. ఇక వెంకీ చెప్పిన లైన్ ఇంట్రస్టింగ్ గా ఉండటంతో మహేశ్ కూడా స్క్రిప్ట్ వర్క్ చేసుకోని ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మని చెప్పినట్లు ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి.

అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం వెంకీ స్క్రిప్ట్ పనులను పూర్తి చేసాడని ఫుల్ స్క్రిప్ట్ ను మహేష్ కి చెప్పాడని.. మహేష్ కూడా దాదాపు సినిమా చేయడానికి ఒప్పుకున్నాడని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు గాని సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ బాగానే వైరల్ అవుతుంది. కాగా భీష్మ ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను సాంధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో వెంకీ తరువాత సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది.

తాజా వార్తలు