స్మాల్ బ్యూటీ పై నిఖిల్ పెద్ద మనసు !

Published on Aug 3, 2020 10:07 pm IST


యంగ్ మలయాళ బ్యూటీ ‘అనుపమ పరమేశ్వరన్’ తెలుగు చివరి సినిమా ‘రాక్షసుడు’ మంచి హిట్ అయినా ఈ స్మాల్ బ్యూటీకి పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం నిఖిల్ సరసన ‘కార్తికేయ 2’లో నటిస్తోంది. ఈ సినిమా తప్ప మరో సినిమా చేతిలో లేకపోవడంతో నిఖిల్ పెద్ద మనసు చేసుకుని తన తరువాత సినిమాలో కూడా హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడట.

నిఖిల్ తన కెరీర్ లోనే క్రేజీ మూవీగా ’18 పేజెస్’ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను తీసుకోబోతున్నారు. కాగా సుకుమార్ మరియు అల్లు అరవింద్ నిర్మాణ సంస్థలలో ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడిగా ఈ సినిమా రాబోతుంది.

ఇక ‘అర్జున్ సురవరం’తో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ ను అందుకున్నాడు నిఖిల్. అన్నట్లు ఈ సినిమాలో హీరో పాత్ర మెమరీ లాస్ సమస్యతో సఫర్ అవుతూ ఉంటుందని అయితే ఈ మెమరీ లాస్ అనేది సెకెండ్ హాఫ్ లో మాత్రమే వస్తోందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :

More