ఆ షో కోసం ఎన్టీఆర్ 12 కోట్లు తీసుకున్నాడట !

Published on Jul 10, 2021 5:00 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ తో సెన్సేషన్ నమోదు చేశాడు. ఈ సారి “ఎవరు మీలో కోటీశ్వరులు”తో మరోసారి మ్యాజిక్ చేయబోతున్నాడు. కాగా ఈ షో షూటింగ్ ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో మొదలైంది. ఇక ఈ షోలో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది. జెమినీ టీవీ ఈ షోను తనదైన శైలిలో కొత్త పద్దతిలో మొదలుపెట్టింది. ఇక ఈ షో కోసం ఎన్టీఆర్ కి దాదాపు 12 కోట్ల పారితోషికం ఇచ్చారట.

ఇక ఈ షో అనౌన్స్ చేసినప్పుడే మంచి హైప్ ను సంతరించుకుంది. అయితే ఈ షో పై అనేక రూమర్స్ వచ్చాయి. నిజానికి ముందు అనుకున్న డేట్ ప్రకారం ఈ ప్రోగ్రాం మే చివరివారం నుంచి ప్రసారం కావాలి. అంతలో కరోనా సెకండ్ వేవ్ వచ్చి ఈ షో పోస్ట్ ఫోన్ అయింది. ఈ నేపథ్యంలో జెమిని టీవీ యాజమాన్యం తాజాగా ఈ షో షూట్ మొదలుపెట్టి క్లారిటీ ఇచ్చింది.

సంబంధిత సమాచారం :