ఎన్టీఆర్ లుక్స్ పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

Published on Aug 3, 2020 6:59 am IST

‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ అప్ డేట్స్ కోసం హీరోల ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. కాగా తాజాగా ఒక అప్ డేట్ తెలిసింది. ఎన్టీఆర్ ఈ సినిమాలో శత్రువులు గుర్తు పట్టకుండా ఉండటానికి భీమ్ తరుచూ తన వేషాన్ని మారుస్తూ ఉంటాడని.. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ లుక్స్ కూడా సినిమాలో ఆరు రకాలుగా ఉండబోతున్నాయని తెలుస్తోంది.

ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజులా, తారక్ కొమరం భీంలా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సరసన ఇద్దరూ హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇప్పటికీ మొదటి హీరోయిన్ గా విదేశీ భామ ‘ఒలివియా మోరిస్’ నటించనుంది. అలాగే రెండో హీరోయిన్ పాత్ర కూడా ఉందట. సినిమాలో ఓ గిరిజన యువతి ఎన్టీఆర్ పాత్రను ప్రేమిస్తోందట. మరి ఆ హీరోయిన్ ఎవరో తెలియాలంటే ఇంకా కొత్త కాలం ఎదురుచూడాల్సిందే.

కాగా ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రీయా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. 2021 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More