‘అరవింద సమేత’లో ఈ తెలుగు హీరోయిన్ నటన ఆకట్టుకుంటుందట !

‘అరవింద సమేత’లో ఈ తెలుగు హీరోయిన్ నటన ఆకట్టుకుంటుందట !

Published on Sep 23, 2018 3:06 PM IST

తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకి పెద్దగా అవకాశాలు రావు అని నానుడి ఉంది. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం ఆడపాదడపా సినిమాలు చేస్తూ తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తెలుగు హీరోయిన్స్ మాత్రం పెద్దగా కనిపించరు. అందం అభినయం ఉన్నప్పటికీ స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయినవారి లిస్ట్ ఇలా చాలామందే ఉన్నారు.

కాగా ఈ మధ్య కాలంలో వచ్చిన అంజలి దగ్గరనుంచి ఈషా రెబ్బా,యామిని భాస్కర్, చాందిని చౌదరి దాకా కొంతమంది తెలుగు హీరోయిన్స్ టాలీవుడ్ లో మంచి గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఈషా రెబ్బా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న’అరవింద సమేత’ చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె, ఎన్టీఆర్ మాజీ ప్రియురాలుగా నటిస్తున్నారట. ఆమె నటనకి మంచి పేరు వస్తోందని.. ఈ చిత్రంతో ఈషాకి మంచి బ్రేక్ వస్తుందని ఫిల్మ్ నగర్ టాక్.

ప్రస్తుతం ఫారెన్ లో షూటింగ్ జరుపుకోబోతున్న ఈ చిత్రంలో.. జగపతి బాబు , నాగబాబులు రెండు ఫ్యాక్షన్ గ్రూపులకు చెందిన నాయకులుగా కనిపించనున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు