చిరంజీవి సినిమాలో రవితేజ పాత్ర అదే ?

Published on Apr 18, 2022 7:22 pm IST

మెగాస్టార్ చిరంజీవితో యంగ్ డైరెక్టర్ కె.ఎస్‌. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఓ పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు రవితేజ కూడా ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. కాగా తాజాగా రవితేజ పాత్రకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది.

సెకండ్ హాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ లో రవితేజ ఈ సినిమాలో కనిపిస్తాడని.. పైగా చిరుకి తమ్ముడి పాత్రలో రవితేజ నటిస్తున్నాడని.. ఈ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని తెలుస్తోంది. అలాగే రవితేజ పాత్ర చనిపోతుందని.. ఈ పాత్ర ద్వారానే చిరు పాత్రలో మార్పు వస్తోందని తెలుస్తోంది.

ఐతే, ఈ వార్తల పై ఇంతవరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. ఈ చిత్రంలో చిరు సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటించబోతుంది. చిరు – శృతి హాసన్ జోడీ నిజంగానే బాగుంటుంది.

సంబంధిత సమాచారం :