అల్లూరి, భీమ్ కలిసే ఘట్టం పైనే ఫ్యాన్స్ ఆసక్తి !

Published on Mar 30, 2020 12:00 am IST

రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రాబోతున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’ నుండి భీమ్ ఫర్ రామరాజు అంటూ వచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. అయితే తాజాగా రాజమౌళి ఈ సినిమా కథ గురించి మాట్లాడుతూ… ‘అల్లూరి సీతారామరాజు.. కొమరం భీమ్ మధ్య కొన్ని పోలికలు ఉన్నాయి. ‘అల్లూరి సీతారామరాజు.. కొమరం భీమ్ నిజ జీవితంలో ఒకరినొకరు కలవలేదు. అయితే వారిద్దరికీ కొన్ని పోలికలు ఉన్నాయి. వారిద్దరూ యుక్త వయసులోనే ఇంటినుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో వారి జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన ఘట్టాల ఆధారంగా సినిమా తీస్తున్నామన్నట్లు రాజమౌళి చెప్పుకొచ్చారు.

అయితే అల్లూరి, భీమ్ నిజ జీవితంలో ఒకరినొకరు ఎప్పుడూ కలుసుకోలేదు. మరి వీరిద్దర్నీ సినిమాలో స్నేహితులుగా రాజమౌళి ఎలా కలిపారో అనే ఘట్టం పై ఫ్యాన్స్ చాల ఆసక్తిగా ఉన్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుందని అని తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మే 20న తారక్ బర్త్ డే రోజున తారక్ పాత్ర మీద కూడా జక్కన్న వీడియో రిలీజ్ చేయనున్నాడు. రాజమౌళి ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పై ఆరంభం నుండి భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో అత్యున్నత భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :

X
More