ఎన్టీఆర్ బర్త్ డేకి కొత్త రిలీజ్ డేట్ ?

Published on May 15, 2021 7:00 pm IST

రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ నుండి మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా కొత్త రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది. అలాగే ఆ రోజున ఎన్టీఆర్ పోస్టర్ కూడా రిలీజ్ చేస్తాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. మరి, ఎన్టీఆర్ పాత్ర మీద రాజమౌళి ఎలాంటి పోస్టర్ ను రిలీజ్ చేస్తాడా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బహుశా కోమరం భీమ్‌ గెటప్ లో ఎన్టీఆర్ ను కొత్తగా చూపించే సరికొత్త పోస్టర్‌ ను రిలీజ్ చేస్తారేమో.

ఇక ఈ మల్టీస్టారర్ లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ క్రేజీ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తుండటం, అలాగే మరో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ మరో కీలక పాత్రలో కనిపించబోతుండటంతో.. ఈ సినిమా కోసం బాలీవుడ్ జనం కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ సినిమాకి ఇంటర్నేషనల్ వైడ్ గా మంచి మార్కెట్ అయ్యేలా ఉంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :