దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో రానున్న సినిమా ‘శాకినీ- ఢాకినీ’. కాగా ఈ సినిమా షూటింగ్ వచ్చే వారం నుండి ఒక సాంగ్ తో స్టార్ట్ చేయనున్నారని.. రెజీనా, నివేదా థామస్ మధ్య వచ్చే ఈ సాంగ్, ఓపెనింగ్ సీక్వెన్స్ లో వస్తోందని తెలుస్తోంది. ఇక ఈ సాంగ్ సినిమా మొత్తానికే స్పెషల్ సాంగ్ లా నిలుస్తోందట. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ కొరియన్ చిత్రం ‘మిడ్ నైట్ రన్నర్స్’ను రీమేక్ గా చేస్తోన్న సినిమా ఇది.
ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా టైంకు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో నివేదా థామస్, రెజీనా కసాండ్ర తమ పాత్రల కోసం కొరియన్ యాక్షన్ కొరియోగ్రఫర్ల వద్ద శిక్షణ కూడా తీసుకున్నారట. అయితే, ‘రణరంగం’ ఆశించిన స్థాయిలో ఆడక పోయే సరికి సుధీర్ వర్మకు ఈ సినిమా కీలకంగా మారింది. మరి ఈ సినిమాతో కూడా హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి.


