సినిమా నుండి తప్పుకొని, షాక్ ఇచ్చిన క్రేజీ హీరోయిన్ !

Published on Sep 18, 2018 8:59 am IST

‘ఛలో’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక మందన్న, ‘గీత గోవిందం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు ఇంకా బాగా దగ్గరైంది. గీత పాత్రలో ఆమె నటన అన్ని వర్గాల ఆడియన్స్ ను అక్కట్టుకున్నేలా ఉంది. ముఖ్యంగా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన గ్లామర్ తోనూ గీత గోవిందం చిత్రం విజయంలో ముఖ్య భూమిక పోషించింది రష్మిక. అయితే తాజాగా ఆమె ఓ సినిమాని రిజెక్ట్ చేసింది.

కన్నడ ‘కిరిక్ పార్టీ’చిత్రంలో తనతో నటించిన రక్షిత్ శెట్టి తో రష్మిక ప్రేమలో పడి, ఆ తర్వాత అతనితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుని.. చివరకు కొన్ని కారణాల వల్ల ఇద్దరు విడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రక్షిత్ హీరోగా నటిస్తున్న ‘వ్రిత్రా’ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు రష్మిక తన ట్విట్టర్ ద్వారా తెలిపింది.

‘‘అందరికీ హాయ్, మీరంతా పండుగ బాగా జరుపుకుని ఉంటారని ఆశిస్తున్నా. నేను వ్రిత్రా చిత్రంలో నటించడం లేదని మీ అందరికి తెలియజేయాలనుకుంటున్నా. కెరీర్ మొదటి దశలోనే ఇలాంటి నిర్ణయం సరైనది కాదని నాకు తెలుసు. కానీ నేను చాలా ఆలోచించి డైరెక్టర్‌కి, ప్రొడ్యూసర్‌కి ఈ విషయాన్ని చెప్పాను. వారు కూడా నన్ను అర్థం చేసుకుని అంగీకరించారు. ఇక నా స్థానంలో వచ్చే నటి ఎవరైనా, నాకన్నా బాగా నటించాలని కోరుకుంటున్నా. గౌతమ్, చిత్ర యూనిట్‌కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్యూ’’ అంటూ రష్మిక ట్వీట్ చేసింది. ప్రస్తుతం రష్మిక ‘దేవదాస్’, ‘డియర్ కామ్రేడ్’ లాంటి క్రేజీ చిత్రాలతో బిజీగా ఉంది.

సంబంధిత సమాచారం :