‘ఎన్టీఆర్’ కుమార్తెగా ప్రముఖ నృత్య కారణి ?

Published on Sep 22, 2018 8:06 pm IST


క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ చిత్రంలో.. ఎన్టీఆర్ పాత్రను బాలయ్య, ఎన్టీఆర్ గారి సతీమణి బసవతారకంగారి పాత్రను విద్యాబాలన్, చంద్రబాబు నాయుడు పాత్రలో రానా, అలాగే అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్ నటిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో కొన్ని కీలమైన పాత్రలకు ఇంకా నటీనటులను ఫైనల్ చెయ్యాల్సి ఉంది.

తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరిగారి పాత్రలో నటించే నటిని కూడా ఫైనల్ చేసారని ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ కింద పిక్‌ లో పురందేశ్వరితో పాటు ఉన్న ప్రముఖ నృత్య కారణి హిమన్సీనే పురందేశ్వరి పాత్రను పోషిస్తున్నారట. ఐతే చిత్రబృందం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

క్రిష్ దర్శకత్వంలో ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :