ఇంట్రెస్టింగ్..మళ్లీ జనతా లుక్ లో తారక్..దేని కోసమో?

Published on Sep 2, 2021 7:07 am IST

మన టాలీవుడ్ లో భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న అతి కొద్ది మంది స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. మరి ఇప్పుడు తారక్ తన బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మల్టీస్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” ని కంప్లీట్ చేసేసి టీవీ షో ఎవరు మీలో కోటీశ్వరులు షో తో బిజీగా ఉన్నారు. ఇక దీనితో పాటుగా తన నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్స్ పై కూడా దృష్టి సారించారు. అయితే ఇవి పక్కన పెడితే ఓ ఇంట్రెస్టింగ్ అంశం ఇప్పుడు రివీల్ అయ్యి వైరల్ అవుతుంది..

తారక్ ఇప్పుడు భీమ్ లుక్ నుంచో మళ్లీ జనతా గ్యారేజ్ చిత్రం లుక్ లోకి మారారు. లేటెస్ట్ ఎవరు మీలో కోటీశ్వరులు కాస్ట్యూమ్స్ లో ఇదే లుక్ తో ఉన్న ఫోటోలు బయటకి వచ్చాయి. దీనితో మళ్లీ తారక్ ఆ లుక్ లోకి మారడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ చేసేది బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలోనే అలాంటిది..

ఇప్పుడు మళ్లీ అదే లుక్ లోకి మారడంతో బహుశా జనతా కి గాని సీక్వెల్ నా లేకపోతే మరేమన్నానా అని సందేహం కలుగుతోంది. మొత్తానికి మాత్రం తారక్ లేటెస్ట్ లుక్ కొత్త ప్రశ్నలనే రేపింది మరి దీనికి సమాధానం ఎప్పుడు దొరుకుతుందో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :