ఆసక్తి గొలుపుతున్న ఉప్పెన ఫస్ట్ వేవ్ ప్రోమో

Published on Feb 5, 2020 10:17 am IST

మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో వస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో టాలెంటెడ్ తమిళ హీరో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఉప్పెన చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.

ఇక నేడు ఉప్పెన చిత్రం నుండి ఫస్ట్ వేవ్ పేరుతో ఓ చిన్న ప్రోమో వీడియో విడుదల చేశారు. హీరో హీరోయిన్ అయిన వైష్ణవ్, కృతి శెట్టి పాత్రలను అస్పష్టంగా పరిచయం చేశారు. వైష్ణవ్ ఈ మూవీలో చేపలు పట్టే జాలరి కుర్రాడిగా కనిపిస్తాడని సమాచారం. ఇక ప్రోమోలో దేవిశ్రీ బీజీఎమ్ ఆహ్లాదంగా ఉంది. ఇక ఈ చిత్రాన్ని ఏఫ్రిల్ 2న విడుదల చేస్తున్నట్లు ప్రకటించేశారు. ఉప్పెన చిత్రానికి బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించారు.

ప్రోమో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :