రవితేజకి ఇడియట్ లా.. విశ్వక్ సేన్ కి పాగల్ అట !

Published on Aug 8, 2020 9:09 pm IST

“ఫలక్ నమా దాస్”తో పాటు ‘హిట్’తో క్రేజీ సక్సెస్ ను సొంతం చేసుకున్న హీరో విశ్వక్ సేన్ హీరోగా, బెక్కెం వేణుగోపాల్ నిర్మాణంలో “పాగల్” అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. క్రేజీ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ను ప్లాన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అన్ని కుదిరితే అక్టోబర్ సెకెండ్ వీక్ నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తారట.

కాగా ఈ మూవీతో నరేష్ రెడ్డి కుప్పిలి అనే యంగ్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. క్రేజీ లవ్ స్టొరీగా తెరకెక్కనున్న ఈ మూవీలో విశ్వక్ సేన్ కొత్తగా కనిపిస్తాడట, ముఖ్యంగా విశ్వక్ సేన్ పాత్ర చాల కొత్తగా ఉండబోతుందని.. రవితేజకి ఇడియట్ ఎలాగో.. విశ్వక్ సేన్ కి పాగల్ అలా ఉండబోతుందని తెలుస్తోంది.

ఇక “ఫలక్ నమా దాస్” మరియు ‘హిట్’ లాంటి సూపర్ హిట్స్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన హీరో విశ్వక్ సేన్ తో లక్కీ మీడియా బ్యానర్ నెక్ట్ ప్రాజెక్ట్ చేయడంతో ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :

More