ఇంటర్వ్యూ : దేవకట్టా – నా పరంగా డైలాగులే సినిమా.!

ఇంటర్వ్యూ : దేవకట్టా – నా పరంగా డైలాగులే సినిమా.!

Published on Jul 3, 2014 6:40 PM IST

deva_katta_interview
ఉద్యోగరీత్యా సెటిల్ అయ్యింది అమెరికాలో కానీ సినిమాపై ఉన్న ఇష్టం వల్ల తన రూటు మార్చి దర్శకుడిగా మారి ‘వెన్నెల’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన డైరెక్టర్ దేవకట్టా. రెండవ సినిమాగా ‘ప్రస్థానం’ సినిమా తీసి అందరి చేత మెప్పు పొందిన దేవకట్టా మూడవ ప్రయత్నంగా చేసిన సినిమా ‘ఆటోనగర్ సూర్య’. ఈ సినిమా మొదటి రోజు యావరేజ్ టాక్ తెచ్చుకొని మళ్ళీ 12 మినిట్స్ కట్ వెర్షన్ తో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ సందర్భంగా ఆయనతో కాసేపు ముచ్చటించాం. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) రోజు రోజుకి ‘ఆటోనగర్ సూర్య’ పై రెస్పాన్స్ ఎలా వస్తోంది.?

స) ఈ సినిమాకి రోజు రోజుకి రెస్పాన్స్ పెరుగుతోంది. మొదటి రోజు కంటే ట్రిమ్మింగ్ వెర్షన్ చూసిన వారు సినిమాకి బాగా కనెక్ట్ అవుతున్నారు. సెకండాఫ్ లో లేచి వెళ్ళకుండా చూస్తున్నారు. ‘ప్రస్థానం’ లానే రెండు మూడు సార్లు చూసిన వాళ్లకి ఈ సినిమా చాలా బాగా ఎక్కేస్తోంది. ఈ రిజల్ట్ తో ఒక 6 నెలలు తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రస్థానం లానే ‘ఆటోనగర్ సూర్య’ కూడా ఓ కల్ట్ క్లాసిక్ లా మిగిలిపోతుందని నమ్మకం మాకు వచ్చింది.

ప్రశ్న) ఓ ట్రైన్ లో జరిగిన దారుణమైన ఇన్సిడెంట్ ని చూసి ఈ కథ రాసుకున్నా అన్నారు. ఆ ఇన్సిడెంట్ లో మిమ్మల్ని అంతలా కదిలించిన విషయం ఏమిటి?

స) ఇందులో నన్ను బాగా కదిలించిన విషయం ఏమిటంటే.. తాగేసి డ్యూటీ చేస్తున్న రైల్వే పోలీసులు, అదే పెద్ద క్రైమ్ మళ్ళీ వాళ్ళు లంచం అడగడం అదొక క్రైమ్, లంచం ఇవ్వలేదని ఏమీ తెలియని వాళ్ళని చంపేయడం అతిపెద్ద క్రైమ్. ఇంత జరిగినా ప్రభుత్వం ఏమీ పట్టించుకోకపోవడం, అలాగే జనాల్లో కూడా రేపు మనకు కూడా ఇలా జరగచ్చు అనే భయం లేకపోవడం. ఇలా అన్ని సమన్వయం అయి ఉన్న ఇన్సిడెంట్ ని నేను ఎప్పుడు చూడలేదు. అది నన్ను బాగా డిస్టర్బ్ చేసింది. దానికోసం రాసిందే మొదటి సినిమా డైలాగ్ ‘నిద్రపోతున్నామని నటిస్తున్నారు’.

ప్రశ్న) ఈ సినిమాకి 1970 – 1990ల నేపధ్యం తీసుకోవడానికి గల కారణం ఏమిటి.?

స) ఈ సినిమాలో పెద్దగా చదువుకోని హీరో ఒక మెకానిక్ గా ఓ మెకానికల్ రంగంలో ఏదో సృష్టించాలి అనుకుంటాడు. అలా వాడు చెయ్యడానికి ఉన్న అవకాశం డీజల్ వెహికల్స్, ఎల్పిజి వెహికల్స్, బ్యాటరీ వెహికల్స్ ని కనిపెట్టడం ఇవన్ని నేను చూపించిన 1970, 1990 లలో అప్పుడప్పుడే వస్తున్నాయి. అందుకే ఆ నేపధ్యాన్ని తీసుకున్నాను.

ప్రశ్న) ప్రస్థానం సినిమాకి జోడించిన కమర్షియల్ ఎలిమెంట్స్ మీకు మైనస్ అయ్యాయి. అక్కడ మైనస్ అయినా మళ్ళీ ఆటోనగర్ సూర్య విషయంలో ఎందుకు రిపీట్ చేసారు?

స) ప్రస్థానంలో కొన్ని సీన్స్ మైనస్ అనుకోని తీసేయాలనుకున్నాం కానీ అప్పుడు ప్రొడ్యూసర్ ఒప్పుకోలేదు. ఆ సినిమా లానే ఈ సినిమా ఎడిటింగ్ రూం ఉన్నప్పుడు ఇప్పుడు కట్ చేసిన సీన్స్ వద్దనుకున్నాం. కానీ బ్రహ్మానందం సీన్స్ థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తారని నన్ను ఒప్పించి పెట్టారు. కొన్ని చోట్ల ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అవి సినిమా కంటెంట్ ని పక్కదారి పట్టించాయి. ఈ సినిమా ద్వారా ఇక నుంచి నా సినిమాలో ఇలాంటి ఫోర్స్ కామెడీ పెట్టకూడదని డిసైడ్ అయ్యాను.

ప్రశ్న) మీ మూడు సినిమాల్లో డైలాగ్స్ పరంగా సక్సెస్ అయిన మీరు డైరెక్టర్ గా ఎందుకు సక్సెస్ కాలేకపోయారు?

స) ప్రేక్షకులు డైలాగ్స్ ని మెచ్చుకున్నారు అంటే సినిమా కూడా మెప్పు పొందినట్టే లెక్క. చాలా మంది డైలాగులే సినిమా కాదంటారు కానీ నా పరంగా డైలాగులే సినిమా.. ఎందుకంటే సినిమాలో ఉన్న కంటెంట్ ని ఎలివేట్ చేసేదే డైలాగ్స్. అవే లేకపోతే మనకు వట్టి ముఖాలే కనపడతాయి.

ప్రశ్న) ఒక రైటర్ గా మీరు హీరో ఎలివేషన్ సీన్స్ బాగా రాసుకొని డైరెక్టర్ గా ఎందుకు తీయలేకపోయారు?

స) ఈ ప్రశ్నకి నాకు తెలిసిన సమాధానం ఒకటే.. మనం ఇప్పటి వరకూ ఒక రకమమైన ఎలివేషన్ చూసాం, కానీ ఇందులో ఉన్న ఎలివేషన్ చూడటానికి కాస్ట్ టైంపడుతుంది. నా సినిమాలో ఉన్న కంటేంటే హీరోయిజం. హీరో పంచ్ డైలాగ్ చెప్పడం వల్ల హీరోయిజం ఎలివేట్ అయ్యింది అంటే నాకు కామెడీగా అనిపిస్తుంది.

ప్రశ్న) మీరు ఎక్కువ భాగం ఉన్నది అమెరికాలో.. కానీ మీకు తెలుగు భాష మీద అంత పట్టు ఎలా వచ్చింది?

స) నా డైలాగ్స్ ని బట్టి నేనేదో పుస్తకాల పురుగు అనుకుంటారు, కానీ నేను అంత పెద్దగా చదవను. కానీ చిన్నప్పుడు తెలుగు టెక్స్ట్ బుక్స్ బాగా చదివేవాన్ని, సి. నారాయణ రెడ్డి గారి ద్విపదాలు చదివాను, అలాగే నాకు ‘గాడ్ ఫాదర్’ తరహా సినిమాలంటే ఇష్టం. ఆ సినిమాల్లో డైరెక్టర్స్ మైండ్స్ సినిమాలో మాట్లాడతాయి. ఇవన్నీ నాకు బాగా నచ్చడం వల్ల డైలాగ్స్ అలా రాయగలుగుతున్నాననుకుంటా..

ప్రశ్న) సినిమాకి సినిమాకి ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నారు? స్క్రిప్ట్ విషయంలో ఎక్కువ టైం తీసుకుంటారా లేక సెట్స్ మీద ఎక్కువ టైం తీసుకుంటారా?

స) సినిమా స్టొరీ లైన్ అనుకున్నాక 3 నెలల్లో ఫుల్ స్క్రిప్ట్ పూర్తి చేస్తాను. ఈ సినిమా అనుకున్నాక చైతు డేట్స్ కోసం కొద్ది రోజులు వెయిట్ చేసాం, ఆ తర్వాత సినిమా పరంగా కాస్త డీప్ గా లోపలి వెళ్ళడం వల్ల కాస్త ఫైనాన్సియల్ గా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఒకానొక టైంలో బాగా స్ట్రెస్ ఫీలయ్యాను. కానీ ఈ సినిమా ద్వారా ‘మనల్ని మనం చంపుకునే రేంజ్ లో దేన్నీ ప్రేమించకూడదు. మనం బతికించే వరకే ప్రేమించాలి’ అనే లెసన్ మాత్రం నేర్చుకున్నాను.

ప్రశ్న) అఖిల్ కి కథ చెప్పారని వార్తలు వినిపిస్తున్నాయి. దాని గురించి కాస్త చెబుతారా?

స) అఖిల్ కి ఒక లవ్ స్టొరీ చెప్పాను. అందులో కాస్త నా తరహా ఇంటెన్స్ యాక్షన్ కూడా ఉంటుంది. తనకి నచ్చింది. కానీ అఖిల్ కి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వేరే కథలు కూడా లైన్ లో ఉన్నాయి. నేను జస్ట్ వెయిట్ చేస్తున్నాను.

ప్రశ్న) సమంతతో ఓ సినిమా చేస్తారని అంటున్నారు. దానిపై మీ కామెంట్?

స) సమంత సూపర్బ్ యాక్టర్. తనతో ఓ ఫుల్ లెంగ్త్ సినిమా చేయాలనుకుంటున్నాను. అలా అని లేడీ ఓరియెంటెడ్ సినిమా కాదు. ‘ఏ మాయ చేసావే’ తరహాలో ఓ సినిమా చేయాలని ఉంది.

ప్రశ్న) మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి?

స) ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయండి. అందులో ఒకటి కంప్లీట్ లవ్ ఎంటర్ టైనర్. రెండవది పొలిటికల్ సెటైరికల్ గా ఉంటుంది. కానీ ఇవి రెండు ప్రస్తుతం డిష్కషన్ స్టేజ్ లో ఉన్నాయి. త్వరలో ఫైనలైజ్ చేసి చెప్తాను.

అంతటితో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కి అల్ ది బెస్ట్ చెప్పి మా ఇంటర్వ్యూని ముగించాం..

 

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు