ఇంటర్వ్యూ : ఈషా రెబ్బా – మారుతిగారు కథ చెప్పినప్పుడు నాకు నా పాత్ర బాగా నచ్చింది !
Published on Jul 25, 2018 4:40 pm IST

సుమంత్ శైలేంద్ర హీరోగా, యాంకర్ ప్రభాకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘బ్రాండ్ బాబు’. వరుస విజయాలతో దూసుకెళ్తున్న దర్శకుడు మారుతీ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. ఇక ఈ చిత్రంతో సుమంత్ శైలేంద్ర సరసన ఈషా రెబ్బా కథానాయకిగా నటిస్తోంది. కాగా ఈ సందర్భంగా, ఈ చిత్ర హీరోయిన్ ఈషా రెబ్బా మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం..

ఈ చిత్రంలో మీ పాత్ర గురించి చెప్పండి ?
ఈ చిత్రంలో నా పాత్ర చాలా కీలకమైనది. ముఖ్యంగా నా పాత్రకు హీరో పాత్రకు మధ్య ఎలా ప్రేమ మొదలవుతుంది, ఆ ప్రేమలో ఎదురయ్యే మిస్ అండర్ స్టాండింగ్స్ ఏమిటి ? వాటిని ఎలా అదిగిమించాం అనేదే ఈ చిత్రంలో చూడొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మారుతిగారి శైలిలోనే ఈ చిత్రం సాగుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు చక్కని హాస్యంతో హ్యాపీగా నవ్వుకోవొచ్చు. చాలా మంది హీరో పాత్రలో మమేకం అవుతారు. ఆ క్యారెక్టర్ ను అలా డిజైన్ చేశారు మారుతిగారు.

బ్రాండ్ బాబు సినిమా గురించి ఒక్క లైన్లో చెప్పాలంటే ?
బ్రాండ్ బాబు మూవీ ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ప్యూర్ కామెడీతో పాటు సెంటిమెంట్, రొమాన్స్ ఇలా అన్ని ఎమోషన్లు ఉన్న చిత్రం ఇది. అండ్ మంచి ప్రేమ కథ కూడా ఉంటుంది. హాయిగా ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడదగ్గ సినిమా ఇది.

మీకు తెలుగులో ఇది ఎన్నో చిత్రం ?
నాకు బ్రాండ్ బాబు ఏడో చిత్రం. అయిన దేవుడి దయవల్ల నేను ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ మంచివే చేశాను.

ఈ సినిమాలో కొత్త హీరోతో కలిసి యాక్ట్ చేశారు. ఎలా అనిపించింది ?
మారుతిగారు కథ చెప్పినప్పుడు నాకు నా పాత్ర బాగా నచ్చింది. అది కాక సుమంత్ శైలేంద్ర ఆల్ రెడీ కన్నడాలో రెండు మూడు చిత్రాల్లో యాక్ట్ చేశాడు. తను తెలుగు సినిమాలకు మాత్రమే కొత్త, (నవ్వుతూ) యాక్టింగ్ కి కాదు. అయినా సుమంత్ శైలేంద్ర మంచి యాక్టర్. సెట్ కు వచ్చేముందే సీన్ ప్రిపేర్ అయి వచ్చేవాడు. డైలాగ్స్ మాడ్యులేషన్స్ తో సహా.

ప్రస్తుతం ఏ ఏ చిత్రాలు చేస్తున్నారు ?
నేను ప్రెజెంట్ ఎన్టీఆర్ గారి సినిమాలో అండ్ సుమంత్ గారితో కూడా ఓ సినిమా చేస్తున్నాను.

ఎన్టీఆర్ సినిమాలో మీ పాత్ర గురించి ?
ఇప్పుడు ఆ సినిమా గురించి నేనేం చెప్పలేను. కానీ ముఖ్యమైన పాత్రల్లో నా పాత్ర కూడా ఉంటుంది.

మీరు ఓన్ గా డబ్బింగ్ చెపుకుంటారా ?
అవునండీ. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నిటిల్లో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పాను.

మీరు తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. అలాగే మీకు తెలుగు చదవడం కూడా వచ్చా ?
నేను హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాను కాబట్టి నాకు తెలుగు బాగానే వచ్చు అండి. నేను చేసిన సినిమాల స్క్రిప్ట్ లన్ని తెలుగులోనే చదువుతాను. అలాగే అప్పుడప్పుడు కొన్ని బుక్స్ కూడా చదువుతాను.

మీరు ఈ సినిమాలో సర్వెంట్ కదా, మీరు ఇంట్లో పనులన్నీ చేస్తారా ?
లేదు అండి. కానీ ఈ సినిమా కోసం కొన్ని పనులు చేశాను. అలాగే ప్రత్యేకంగా ఈ సినిమా కోసం మా సర్వెంట్ ను అబ్జర్వ్ చేసి మరి ఆమె నుండి కొన్ని మ్యానరిజమ్స్ (నవ్వుతూ) కాపీ కొట్టాను కూడా.

మీరు ఎవర్నైనా లవ్ చేశారా ?
ప్రస్తుతానికైతే అలాంటిది ఏం లేదండి. సో బ్రాండ్ బాబు ఆగష్టు ఫస్ట్ వీక్ లో రిలీజ్ అవుతుంది. అందరూ చూసి ఎంజాయ్ చెయ్యండి.

  • 6
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook