ఇంటర్వ్యూ : మార్కాపురం శివకుమార్ – ‘ఏ మంత్రం వేశావే’ సినిమాలో అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయి !
Published on Mar 6, 2018 4:41 pm IST

చాన్నాళ్ల పాటు విడుదలకాకుండా వాయిదాపడుతూ వచ్చిన విజయ్ దేవరకొండ చిత్రం ‘ఏ మంత్రం వేశావే’ ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా చిత్ర సమర్పకుడు మార్కాపురం శివకుమార్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) సినిమా గురించి చెప్పండి ?
జ) ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్. అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉంటాయి. విజయ్ పాత్ర, అతని నటన ప్రేక్షలకు బాగా నచ్చుతాయి.

ప్ర) ఈ సినిమాను మీరు రిలీజ్ చేయడానికి ప్రత్యేక కారణాలేవైనా ఉన్నాయా ?
జ) మొదట్లో ఈ ప్రాజెక్టులో అసలు నేను లేను. కానీ ఆర్థిక ఇబ్బందుల వలన సినిమా ఆగిపోయింది. ఆ నైపథ్యంలో నేను సినిమా చూడటం, అది నచ్చడంతో థియేట్రికల్ రైట్స్ కొన్నాను.

ప్ర) విజయ్ సినిమాను ఎందుకు ప్రమోట్ చేయడంలేదు ?
జ) సినిమాను మార్చిలోనే రిలీజ్ చేయాలని అనుకున్నాం. కానీ విజయ్ తన షెడ్యూళ్లతో బిజీగా ఉండటం మూలాన అతను ప్రమోషన్లలో పాల్గొనలేకపోయారు. అంతేగాని వేరే కారణేలేవీ లేవు.

ప్ర) సినిమా హాళ్ల నిరసన సంగతేమిటి ?
జ) ఎట్టకేలకు సంతృప్తికర పరిష్కారంతో ఈరోజుటితో నిరసన ముగిసే అవకాశాలున్నాయి. సాయంత్రానికి అధికారిక ప్రకటన వెలువడుతుంది.

ప్ర) ‘అర్జున్ రెడ్డి’ క్రేజ్ వలనే మీరు ఈ సినిమా హక్కుల్ని కొన్నారా ?
జ) లేదు. సినిమా చూశాను. కంటెంట్ నచ్చింది. ప్రేక్షకులకి ముఖ్యంగా యువతకు నచ్చుతుందని అనుకుంటున్నాను.

ప్ర) మీ తర్వాతి సినిమాలేవిటి ?
జ)తమిళ చిత్రం ‘గులేభాగావళి’ని తెలుగులో విడుదల చేయాలనుకుంటున్నాను. ఆ తరవాత ఇంకో మూడు ప్రాజెక్ట్స్ ఏప్రిల్ లో మొదలవుతాయి. ‘సూర్య వెర్సెస్ సూర్య’ను హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నాను.

 
Like us on Facebook