ఇంటర్వ్యూ : అల్లరి నరేష్ – “బంగారు బుల్లోడు” అనే టైటిల్ అందుకే తీసుకున్నాం

Published on Jan 21, 2021 3:07 pm IST

తనదైన కామెడీ సినిమాలతో మన టాలీవుడ్ లో మంచి బెంచ్ మార్క్ ను సెట్ చేసుకున్న హీరో “అల్లరి” నరేష్. ఎలాంటి రోల్ లో అయినా బాగా చెయ్యగలిగే ఈ టాలెంటెడ్ హీరో నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ “బంగారు బుల్లోడు”. మరి ఈ సందర్భంగా మేము ఓ ఇంటర్వ్యూ తీసుకున్నాం మరి అల్లరి నరేష్ ఎలాంటి విషయాలను పంచుకున్నారో ఇప్పుడు చూద్దాం.

 

ఈ సినిమా “బంగారు బుల్లోడు” అనే టైటిల్ నే ఎందుకు తీసుకున్నారు?

ఈ సినిమాలో నా రోల్ అంతా బంగారం లోన్స్ చుట్టూతానే తిరుగుతుంది అలాగే చాలానే ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఓ రోజు మా ప్రొడ్యూసర్ అనీల్ సుంకర గారు ఈ బంగారు బుల్లోడు అనే టైటిల్ ను సజెస్ట్ చేశారు. మాకు నచ్చింది పెట్టాము అంతే కానీ బాలకృష్ణ గారి సినిమా కు దీనికి అయితే ఎలాంటి సంబంధం ఉండదు.

 

చాలా కాలం తర్వాత ఒక కామెడీ చెయ్యడానికి కారణం ఏంటి?

ఒక విలేజ్ కామెడీ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. నేను కొన్ని కామెడీ సినిమాలు చేశాను కానీ చిన్న టౌన్స్ తరహావి చేశాను అప్పుడు ఈ స్టోరీ కోసం విన్నాక దానికి ఎంటర్టైన్మెంట్ ను యాడ్ చేసి ప్లాన్ చేసాం. అలాగే మా సినిమాలో ఎలాంటి స్పూఫ్ కామెడీ ఉండదు.

 

పి వి గిరి గారితో వర్క్ ఎలా ఉంది?

ఆయన చాలా పట్టుదల గల దర్శకుడు అండి. తన సినిమాలూ ప్రతీ అంశం పర్ఫెక్ట్ గా ఉండాలి అనుకుంటారు. మా నిర్మాత సినిమా ఎలా అయితే కోరుకున్నారో అదే విధంగా ఈ సినిమాను మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో చేశారు. అలాగే ఈ సినిమా స్రిప్ట్ చెప్పిన విధానం కూడా నాకు బాగా నచ్చింది.

 

మరి ఈ సినిమా ఇంత లేట్ ఎందుకు అయ్యింది?

నేను మహర్షి షూట్ లో ఉన్నప్పుడు కొన్ని విషయాలు అనుకూలించలేదు. ఆ సినిమాను నేను వేరే లుక్ లో ఉన్నాను అందులోనూ పెద్ద సినిమా అందుకే బాగా లేట్ అయ్యింది. ఆ తర్వాత కూడా మళ్ళీ ఈ సినిమా షూట్ కూడా లేట్ అయ్యింది. కానీ ఫైనల్ గా 2020 సమ్మర్ లో విడుదలకు ప్లాన్ చేద్దాం అనుకునే సరికి లాక్ డౌన్ వచ్చింది. సో ఫైనల్ గా ఇక్కడ ఉన్నాం.

 

మీరు బాలకృష్ణకి ఆ రీమిక్స్ సాంగ్ ను చూపించారా?

మళ్ళీ చెప్తున్నాను ఈ సాంగ్ ఐడియా పూర్తిగా మా నిర్మాత అనీల్ సుంకర గారిదే. ఈ సాంగ్ ను ఒక ప్రత్యేక విధానంలో లాంగ్ షూట్ లో తియ్యాలి అనుకున్నాం అందుకే సినిమా మొత్తం అయ్యాక ఈ సాంగ్ ను చేసాం. అలాగే చాలా మంది సింగర్స్ అనుకున్నాం కానీ ఫైనల్ గా రేవంత్ దీనికి న్యాయం చేసాడు.

 

మీ కెరీర్ ను డిఫరెంట్ సినిమాలతో ఎలా బ్యాలన్స్ చెయ్యగలుగుతున్నారు?

నేను ఇక్కడ ఎక్కువ కాలం ట్రావెల్ అయ్యేందుకే వచ్చాను నటుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నా అందుకే కంటెంట్ ఉన్న “నాంధి” లాంటి సినిమా చేశాను. అందులో చాలా కొత్తగా కనిపిస్తాను. అలాగే ఒక వెర్సిటైల్ ఆక్టర్ అనిపించుకోవాలి అన్నదే నా కోరిక

 

మరి నాంధి ఎప్పుడు వస్తుంది?

ఈ సినిమా ఖచ్చితంగా చాలా స్పెషల్ గా ఉంటుంది చాలా మంది కూడా అడుగుతున్నారు. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా అవుతున్నాయి. త్వరలోనే ఆ డేట్ ను అనౌన్స్ చేస్తాము. నేనయితే చాలానే ఆ సినిమాపై నమ్మకం పెట్టుకున్నాను.

 

ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమన్నా.?

ప్రస్తుతానికి నాలుగు కథలు ఓకే చేశాను, అలాగే నాంధి డైరెక్టర్ తోనే ఇంకో సినిమా కూడా ఒప్పుకున్నా, ప్రస్తుతానికి అయితే నా దృష్టి అంతా ఈ సినిమా అలాగే నాంధి పైనే ఉన్నాయి. త్వరలోనే మీ ముందుకు మరిన్ని సినిమాలతో ఖచ్చితంగా వస్తాను.

సంబంధిత సమాచారం :

More