ఇంటర్వ్యూ : హాలీవుడ్ నటి ఎల్నాజ్ నోరౌజీ – “డెవిల్” లో అవకాశం అలా వచ్చింది

ఇంటర్వ్యూ : హాలీవుడ్ నటి ఎల్నాజ్ నోరౌజీ – “డెవిల్” లో అవకాశం అలా వచ్చింది

Published on Dec 30, 2023 12:36 PM IST

ఇండియాలో హిట్ సిరీస్ లలో ఒకటిగా పిలవబడే “సేక్రేడ్ గేమ్స్”లో నటించి మంచి పేరు తెచ్చుకున్న నటి ‘ఎల్నాజ్ నొరౌజీ’. “కాందహార్” చిత్రంతో హాలీవుడ్‌లో తెరగేంట్రం చేసి, పాపులర్ గెరార్డ్ బట్లర్‌తో స్క్రీన్‌ను పంచుకుంది. అయితే రీసెంట్ గా నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘డెవిల్’ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంతోనే ముఖ్యమైన పాత్ర పోషిస్తూ, బోల్డ్ లుక్స్ తో ప్రత్యేక పాటలో నర్తించి అందరిని కవ్వించింది. డిసెంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన “డెవిల్” సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మరో ఈ సందర్భంగా హీరోయిన్ ‘ఎల్నాజ్ నౌరౌజీ’ ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూ విశేషాలు చూద్దాం రండి.

ఇరాన్‌లో పుట్టి, పెరిగిన మీరు..ఇండియన్ సినిమాకి ఎలా వచ్చారు?

నేను చిన్నప్పటి నుంచి హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు చూస్తూ పెరిగాను. సో.. బాలీవూడ్ లో యాక్ట్ చేయాలనీ నా కల j. ప్రపంచంలో ఎక్కడ లేని ప్రత్యేకత భారత్ కి ఉంది. ఇక్కడ అన్ని కళలని ప్రోత్సహిస్తారు. నాకు బాగా నచ్చింది. అందుకే ఇక్కడ యాక్ట్ చేయాలనుకున్నాను.

మీకు బాలీవుడ్‌లో పనిచేసిన అనుభవం ఉంది. తెలుగు సినిమాలో పనిచేసిన అనుభవం ఎలా ఉంది?

‘డెవిల్’, సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో ఓ పాట ద్వారా స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. సౌత్ లో ప్రజలు చాలా పోలైట్ గా, కుటుంభ సాంప్రదాయాలకు విలువలు ఇస్తారు. ముఖ్యంగా, తెలుగు ప్రజలు అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు సినిమాలో నటించడం నాకు చాలా గర్వంగా ఉంది. అవకాశాలు వస్తే తెలుగులో అందరి హీరోలతో తప్పకుండా చేస్తాను.

డెవిల్‌లో నటించడం ఎలా అనిపించింది? ఈ చిత్రంలో ఛాన్స్ ఎలా వచ్చింది?*

ఇంతకముందు తెలుగులో ఏ సినిమా చేసిన ఎక్సపీరియన్స్ లేదు. ‘డెవిల్’ లో సాంగ్ చేయడానికి చాలా హోమ్ వర్క్ చేశాను, కొన్ని విషయాలు తెలియకపోతే తెలుసుకొని చేశాను. నాకు, ఈ సినిమాలో నా నృత్యాన్ని చూసి తీసుకున్నారు. నాకు పెద్దగా బ్యానర్స్ గురించి తెలియదు. దక్షిణాదిలో అభిషేక్ పిక్చర్స్ ప్రొడక్షన్లో పని చేయటం, వాళ్ళ ద్వారా ఇంట్రడ్యూస్ అవ్వడం చాలా హ్యాపీగా భావిస్తున్నాను.

కళ్యాణ్‌రామ్‌తో వర్క్ కోసం చెప్పండి

కళ్యాణ్ రామ్ తో కలిసి పనిచేయడం నా అదృష్టం. ఆయన సెట్‌లో చాలా సైలెంట్, అలాగే షై కూడా.. సెట్ లో నాకు చాలా హెల్ప్ చేసారు. ముఖ్యంగా, డైలాగ్స్ చెప్పేటప్పుడు నాకు ఎన్నో టిప్స్ చెప్పారు. ఆయనతో టైమ్ స్పెండ్ చేయడం నాకు బాగా నచ్చింది. నాకు ఇప్పటికి ఏడు ల్యాంగ్వేజ్ లు తెలుసు. తెలుగు కూడా త్వరలోనే నేర్చుకుంటా.

టాలీవుడ్ కి.. బాలీవుడ్ కి తేడా ఏమైనా గమనించారా?

నాకు టాలీవుడ్ చాలా కొత్త. సో, ఇప్పుడే ఆ విషయం గురించి నేను చెప్పలేను. ప్రస్తుతానికి అందరూ ప్రొఫిషనల్స్ గా వర్క్ చేస్తున్నారు.

మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం చెప్పండి?

నవాజుద్దీన్ సిద్ధిఖీతో సంగీన్ అనే ఒక థ్రిల్లర్ రాబోతుంది. ‘రాణీతి’ అనే మూవీ జియో సినిమాలో విడుదలయ్యే సిరీస్. నేను చేస్తున్న పాట ‘వోహ్’ కూడా అదే ప్లాట్ ఫార్మ్ లో రీలిజ్ అవ్వుతుంది. అలా, పైప్‌లైన్‌లో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మీకు త్వరలో తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు