ఇంటర్వ్యూ : నాగార్జున – “వైల్డ్ డాగ్” లో సాంగ్స్ అందుకే పెట్టలేదు..

Published on Mar 31, 2021 4:00 pm IST

టాలీవుడ్ కింగ్ నాగార్జున చాలా కాలం తర్వాత మళ్ళీ సిల్వర్ స్క్రీన్ ను హిట్ చేసేందుకు సాలిడ్ స్క్రిప్ట్ తో వస్తున్న చిత్రం “వైల్డ్ డాగ్”. నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అహిషోర్ సాలొమోన్ దర్శకత్వం వహించారు. మరి ఈ వచ్చే వారమే విడుదలకు రెడీగా ఉన్న సందర్భంగా నాగ్ తో స్పెషల్ ఇంటర్వ్యూ తీసుకున్నాం మరి తాను ఏం చెప్పారో చూద్దాం.

 

ఈ వైల్డ్ డాగ్ ఇంతలా ప్రమోట్ చేస్తున్నారు కారణం ఏంటి?

అవును ఇంతకు ముందు నా ఏ సినిమాకు కూడా ఇంతలా ప్రమోషన్స్ చెయ్యలేదు. కానీ ఈ వైల్డ్ డాగ్ లాంటి సినిమాకి డెఫినెట్ గా ప్రమోషన్స్ ఉండాలి. కొత్త తరహా సినిమా అందరికీ రీచ్ కావాల్సిన సినిమా ఇది అందుకే నేను కూడా బయటకొచ్చి ఇంతలా ప్రమోట్ చేస్తున్నా..

 

మరి వైల్డ్ డాగ్ తో మీరు 40వ కొత్త డైరెక్టర్ ని పరిచయం చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది?

నేను ఎప్పుడూ కాస్త అడ్వాన్స్ గా ఆలోచించడానికే ట్రై చేస్తాను. అందుకే కొత్త దర్శకులకి ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటా. నేను కూడా చేసిందే చేసి కాస్త విసిగిపోయా సో అందుకే కొత్త దర్శకులు అయితే నన్ను కూడా కొత్తగా ప్రెజెంట్ చేస్తారు అనుకుంటా. అలాగే నేను ఈ పొజిషన్ లో ఉండడానికి కారణం కూడా నేను లాంచ్ చేసిన కొత్త దర్శకులే అని భావిస్తా..

 

మీ రోల్ కోసం చెప్పండి..

నేను ఇందులో ఎన్ ఐ ఏ ఆఫిసర్ వినయ్ వర్మగా కనిపిస్తా.. ఈ రోల్ మంచి పవర్ ఫుల్ గా ఉంటుంది. మరి అలాంటి రోల్ టెర్రర్ కు రిలేటెడ్ ఓ సీరియస్ సమస్యలో దిగినప్పుడు దాన్ని సాల్వ్ చెయ్యడం వంటివి ఆ టైప్ లో నా రోల్ పై రేటింగ్ చాలా బాగుంటుంది.

 

ఈ సినిమాలో ఎలాంటి సాంగ్స్ లేనట్టున్నాయ్ మీకు ఓకే అనిపించిందా?

అవును పాటలు ఎక్కడా ఉండవ్, కానీ దాని వల్ల నాకు ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు కూల్.. ప్రస్తుతం అయితే సినిమాకు తగ్గట్టుగా పాటలు ఉండకపోతేనే ఎక్కువ ఇష్టపడుతుంన్నారు. నేను కూడా ఇలాంటి సీరియస్ సినిమాకి సాంగ్స్ అనుకున్నాను. ఎందుకంటే వాటి వల్ల ఫ్లో దెబ్బ తినొచ్చు.

 

మీకు ఈ ఏజ్ లో ఇలాంటి యాక్షన్ సినిమా చెయ్యడం ఎలా అనిపించింది?

నేనెప్పుడూ ఫిట్ గానే అనుకుంటా అదే నాకు ఈ సినిమా విషయంలో చాలా ప్లస్ అయ్యింది. షూట్ టైం లో కాస్త చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఈ సినిమాలో యాక్షన్ కోసం కష్టపడడం నాకు నచ్చింది.

 

మరి మీ ‘బ్రహ్మాస్త్ర’ కోసం ఏమన్నా చెప్తారా.?

నేను ఇప్పుడే దాని కోసం ఏం చెప్పలేను కానీ నా రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది దానికి నా బెస్ట్ కూడా ఇచ్చేసా.. నాపై ఒక అరగంట వరకు ఉంటుంది అది ఖచ్చితంగా మంచి హిట్ అవుతుంది అనుకుంటున్నా.

 

వైష్ణవ్ తేజ్ తో సినిమా ఉందని అంటున్నారు ఉందా?

అవును వైష్ణవ్ తో ఓ సినిమా మేము చేస్తున్నాం. దానికి కూడా ఆల్రెడీ ఓ కొత్త డైరెక్టర్ లాక్ అయ్యాడు. వైష్ణవ్ కి కూడా స్క్రిప్ట్ నచ్చింది. సో తొందరలోనే ఆ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేస్తాం..

 

ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి?

ప్రస్తుతం ప్రవీణ్ సత్తరుతో ప్లాన్ చేసిన సినిమా షూట్ నడుస్తుంది. అలాగే బంగార్రాజు పై స్క్రిప్ట్ వర్క్ అవుతుంది. ఇంకా కొన్ని వెబ్ సిరీస్ లు కూడా ప్లాన్ లో ఉన్నాయి.

సంబంధిత సమాచారం :