ఇంటర్వ్యూ : రాంకీ – ఈ సినిమా కోసం నేను కూడా ఓ కొత్త నటుడిలా మారిపోయాను.

ఇంటర్వ్యూ : రాంకీ – ఈ సినిమా కోసం నేను కూడా ఓ కొత్త నటుడిలా మారిపోయాను.

Published on Jul 9, 2018 12:53 PM IST

కార్తికేయ, పాయల్ రాజపుత్ జంటగా అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఎక్స్100’ ఈ చిత్రం ఈ నెల 12 న విడుదలవుతున్న సందర్బంగా ఈ చిత్రంలో తండ్రి పాత్రలో నటించిన రాంకీ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం..

అసలు ఈ ‘ఆర్ఎక్స్100’ సినిమాలో మీరు నటించడానికి కారణం ఏమిటి సర్ ?
కథే కారణమండి. ఈ సినిమాలో నేను చేస్తే బాగుంటుందని మొదట డైరెక్టర్, ప్రొడ్యూసర్ చెన్నై వచ్చి నన్ను కలిసారు. కథ విన్నాను. నాకు బాగా నచ్చింది. వెంటనే వారికి ఈ సినిమా చేస్తున్నానని చెప్పాను.

ఈ సినిమాలో మీరు ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారు ?
ఇందులో నా పాత్ర చాలా మంచి పాత్ర. అందరూ అనుకున్నట్లు ఈ సినిమాలో నేను హీరోకి తండ్రిగా నటించలేదు. అసలు ఈ సినిమాలో నాకు పెళ్లే కాదు. హీరో కోసం అతని లైఫ్ కోసం నా పాత్ర అంకితం అయిపోతుంది. నిజంగా ఇది గొప్ప పాత్ర.

డైరెక్టర్ అజయ్ భూపతికి ఇది మొదటి సినిమా. ఆయనతో వర్క్ చెయ్యడం మీకు ఎలా అనిపించింది ?
వెరీ ఇంప్రెస్డ్ అండి. నేను సినిమా పరిశ్రమలో ముప్పై సంవత్సరాల నుండి దాదాపు వందకు పైగా చిత్రాల్లో నటించాను. ఎన్నో చూశాను. ఒక్కటి చెప్తారు ఇంకోలా తీస్తారు. కానీ ఈ డైరెక్టర్ ఏం చెప్పారో దాని కన్నా బాగా తీశారు.

ఈ సినిమా గురించి చెప్పండి. అవుట్ ఫుట్ ఎలా వచ్చింది ?
అనుకున్న దానికన్నా బాగా వచ్చింది. ఎందుకంటే ఈ సినిమాలో బెస్ట్ టెక్నీషయన్స్ పని చేసారు. ఎడిటర్ ప్రవీణ్ గారు, కెమెరా మెన్ రామారెడ్డిగారు చాలా బాగా చేశారు. ఒక్క సీన్ కోసం ఐదు కెమెరాలు వాడిన సందర్భాలు ఉన్నాయి. డైరెక్టర్ బాగా ప్లాన్ చేశారు. ఆర్టిస్ట్ ల దగ్గరనుండి బాగా నటన రాబట్టుకున్నారు. నిజానికి ఈ సినిమా కోసం నేను కూడా ఓ కొత్త నటుడిలా మారిపోయాను.

మీరు అసలు సినిమాల్లోకి ఎలా వచ్చారు ?
మా ఇంట్లో అంతకుముందు ఎవరూ సినిమాల్లో లేరండి. నేనే మొదటి వ్యక్తిని. ఫిల్మ్ స్కూల్ లో చదివి వచ్చాను. వచ్చిన వెంటనే నేను చేసిన ఎనిమిది సినిమాలు వరుసగా హిట్ అయ్యాయి, వంద రోజులు కూడా ఆడాయి. కానీ నాకు అప్పుడు కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియలేదు. దాంతో హీరోగా ఎక్కువ సినిమాలు చేయకలేకపోయాను.

మీకు తెలుగులో కూడా మంచి గుర్తింపు ఉంది. ఎందుకు తెలుగులో ఎక్కువ సినిమాలు చెయ్యట్లేదు ?
ఆ మధ్య ఆకతాయి చిత్రంలో నటించాను, ఆ చిత్రం తర్వాత ‘ఆర్ఎక్స్100’లోనే చేస్తున్నాను. మంచి పాత్రలు వస్తే నేను నటించడానికి ఎప్పుడు సిద్దమే.

మీరు చాలా సంవత్సరాలు తమిళ్ సినిమాల్లో కూడా నటించలేదు. ఎందుకు ?
అవునండి ఏడు ఎనిమిది సంవత్సరాల దాకా తమిళంలో కూడా ఏ సినిమా చేయలేదు.

అన్ని సంవత్సరాలు చెయ్యకపోవటానికి కారణం ఏమైనా ఉందా ?
నాకు డైరెక్షన్ మీద బాగా ఆసక్తి. దాంతో డైరెక్షన్ స్టార్ట్ చేశాను. నేను చేసిన కొన్ని సీరియల్స్ బాగా హిట్ అయ్యాయి కూడా.

ఈ ‘ఆర్ఎక్స్100’ సినిమా ప్రొడ్యూసర్స్ గురించి చెప్పండి ?
మంచి ప్రొడ్యూసర్స్. రెగ్యూలర్ ప్రొడ్యూసర్స్ కంటే ఆర్టిస్ట్ లను బాగా చూసుకున్నారు. ప్రొడక్షన్ బాగా ప్లాన్ చేశారు.

తమిళంలో హీరోలు ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నారు. మీరు కూడా పాలిటిక్స్ లోకి వచ్చే అవకాశం ఉందా ?
లేదండి. నాకు పాలిటిక్స్ మీద పెద్దగా ఆసక్తి లేదు..

మీరు విలన్ పాత్రలు చెయ్యటానికి కూడా రెడీయేనా ?
కంటెంట్ ఉంటే, సినిమాలో నేను చేసే పాత్రకు ఇంపార్టెంట్ ఉంటే.. ఏ పాత్ర అయినా చేస్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు