ఇంటర్వ్యూ : ఎస్ఎస్ థమన్ – నేను ధోనికి పెద్ద అభిమానిని.!

ఇంటర్వ్యూ : ఎస్ఎస్ థమన్ – నేను ధోనికి పెద్ద అభిమానిని.!

Published on Apr 10, 2014 1:39 PM IST

Thaman

ప్రస్తుతం టాలీవుడ్ ని ఒక ఊపు ఊపుతున్న సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్. ఈ మధ్య వస్తున్న దాదాపు అన్ని సినిమాలకు ఇయనే సంగీతం సమకూరుస్తున్నారు. ఇటివలే విడుదల అయిన ‘రేసు గుర్రం’ పాటలకు కూడా ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలను తెలుసుకోవడానికి ఎస్ఎస్ తమన్ తో కాసేపు ముచ్చటించాం..

ప్రశ్న) ‘రేసు గుర్రం’ పాటలకి ఎలాంటి స్పందన వస్తోంది?

స) ‘రేసు గుర్రం’ పాటలకి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తుంది. గత ఏడాది నుండి ఈ సినిమాపై పని చేస్తున్నాను, సినిమా విడుదల తరువాత ‘రేసు గుర్రం’ పాటలకి ఇంకా క్రేజ్ పెరుగుతుంది.

ప్రశ్న) అల్లు అర్జున్ ఎక్కువగా దేవీశ్రీ ప్రసాద్ తో పనిచేశారు, దానివల్ల మొదట్లో మీరు ఏమైనా ఇబ్బందిపడ్డారా?

స) మొదట్లో కాస్త ఇబ్బందిపడినప్పటికి, ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకోని, బన్ని అన్ని సినిమాల కంటే మంచి సంగీతాన్ని ఇచ్చి నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నాను.

ప్రశ్న) అల్లు అర్జున్ తో పని చేయటం ఎలా అనిపించింది, బన్ని మీకు ఏమైనా సలహాలు ఇచ్చారా?

స) బన్ని తనకు ఎలాంటి సంగీతం కావాలనే దానిపై నాకు చాలా సలహాలు ఇచ్చాడు. మేము ఒక టీం వర్క్ తో పని చేశాం. తన డ్యాన్స్ లతో బన్ని నా పాటలకి మరింత ఎనర్జీ తీసుకొచ్చాడు.

ప్రశ్న) మీరు చేసిన ట్యూన్స్ లో ఎవైన బన్ని కానీ సురేందర్ రెడ్డి కానీ తిరస్కరించారా?

స) నా ట్యూన్స్ ని వారు ఎప్పుడు తిరస్కరించలేదు. టైటిల్ సాంగ్ కి మాత్రం మూడు వెర్షన్లు తీసి అందులో ది బెస్ట్ అనుకున్నది ఎంపిక చేసుకున్నాం.

ప్రశ్న) ‘రేసు గుర్రం’ సినిమా గురించి మీరు ఏమనుకుంటున్నారు?

స) ఈ సినిమా చాలా స్టైలిష్ గా వచ్చింది, పాటలకు కూడా మార్కెట్ లో మంచి స్పందన లబించింది. విడుదల తరువాత సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను.

ప్రశ్న) డైరెక్టర్ సురేందర్ రెడ్డితో పని చేయడం ఎలా అనిపించింది?

స) సురేందర్ రెడ్డి నాకు ఒక కుటుంబ సబ్యుడి లాంటి వాడు. సెట్స్ లో చిన్నవారైన, పెద్దవారైన అందరి సలహాలు తీసుకుంటాడు. సంగీతం విషయంలో నాకు పూర్తి స్వేచ్చని ఇచ్చాడు, నేను కూడా తనను నిరుత్సాహపరచలేదని అనుకుంటున్నాను.

ప్రశ్న) అటు తమిళ్, ఇటు తెలుగు రెండు భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు కదా, రెండు ఎలా బ్యాలన్స్ చేయగలుగుతున్నారు?

స) ప్రస్తుతం నాకు టాలీవుడ్ లో పెద్ద సినిమాలు ఉన్నాయి, కావున ఇక్కడే ఎక్కువ దృష్టి పెట్టాను. తమిళ్ లో ఒక సినిమా తరువాత ఇంకోటి అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్తున్నా, త్వరలో ఇంకా పెద్ద బ్యానర్స్ కి, పెద్ద స్టార్స్ కి కూడా సంగీతం అందించబోతున్నాను.

ప్రశ్న) తమిళ్ తో పోల్చుకుంటే, తెలుగులో సంగీత విలువలు ఎలా ఉన్నాయి?

స) సంగీతానికి సంభందించి రెండు భాషలలోను పెద్ద తేడాలు అంటూ ఏమి లేవు. తెలుగులో హీరోని, అతని అభిమానులను దృష్టిలో పెట్టుకొని సంగీతం సమకుర్చాలి. అదే తమిళ్ లో అయితే పాట మీద తప్ప ఇంకా ఇతర విషయాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.

ప్రశ్న) మీ ఖాళీ సమయాలలో మీరు ఏం చేస్తూ ఉంటారు?

స) నాకు ఖాళీ సమయం దొరికిందంటే క్రికెట్ అడుతుంటాను. ప్రతి రోజు ప్యాక్ అప్ చెప్పాక, మా టీం మొత్తం కలిసి క్రికెట్ ఆడుతాం. నేను ధొనీకి పెద్ద అభిమానిని.

ప్రశ్న) మీ భవిష్యత్ ప్రణాళికలు, రాబోయే సినిమాల గురించి ఏమైనా చెబుతారా?

స) హైదరాబాద్ లో ఒక మూజిక్ స్కూల్ పెట్టాలని నా ఆశ. నా తదుపరి సినిమాలు ‘రభస’, ‘ఆగడు’, ‘గోవిందుడు అందరివాడేలే’.

అంతటితో మా ఇంటర్వ్యూని ముగించి ‘రేసు గుర్రం’ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని థమన్ కి సంగీతం అందించాం.

 

ఇంటర్వ్యూ – అవద్.ఎం

అనువాదం – ఇ. అరుణ్ కుమార్

 

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు