ఇంటర్వ్యూ : సాగర్ మహతి – యోగి గారు తప్ప ఇంకెవరూ నా నుంచి బెస్ట్ అవుట్ పుట్ రాబట్టుకోలేరు.

ఇంటర్వ్యూ : సాగర్ మహతి – యోగి గారు తప్ప ఇంకెవరూ నా నుంచి బెస్ట్ అవుట్ పుట్ రాబట్టుకోలేరు.

Published on Apr 29, 2015 5:27 PM IST

Sagar-Mahat టాలీవుడ్ లో అందరి స్టార్ హీరోలతో పనిచేసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించి మెలోడీ బ్రహ్మగా పేరుతెచ్చుకున్న మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ. ఇప్పుడు ఆయన తనయుడు సాగర్ మహతి ‘జాదూగాడు’ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఇటీవలే విడుదలైన జాదూగాడు పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా సాగర్ మహతి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) అసలు మ్యూజిక్ డైరెక్టర్ గా మీకు అవకాశం ఎలా వచ్చింది.?

స) నేను స్వతహాగా కీ బోర్డ్ ప్లేయర్ ని, చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పనిచేసాను. నేను మ్యూజిక్ డైరెక్టర్ గా మారడానికి కారణం మాత్రం ఈ మూవీ డైరెక్టర్ యోగి గారే.. ఆయనే నన్ను ఎంకరేజ్ చేసి సెలక్ట్ చేసారు. యోగి గారి కంటే బెస్ట్ అవుట్ పుట్ ఇంకెవరూ రాబట్టుకోలేరని నేను నమ్ముతున్నాను. ఈ చిత్ర ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు కూడా నా ఎంతో సపోర్ట్ ఇచ్చారు. వారిద్దరికీ నా స్పెషల్ థాంక్స్..

ప్రశ్న) మణిశర్మ గారంటే రీ రికార్డింగ్ మరియు మెలోడీ సాంగ్స్ స్పెషలిస్ట్ అంటారు. ఆయన మీరు ఎందులో స్పెషలిస్ట్.?

స) నా పరంగా స్పెషలైజేషన్ అంటే అది మనకు వచ్చిన సినిమా జోనర్ ని బట్టి ఉంటుంది. ఒక్కో జోనర్ సినిమాకి ఒక్కోలా మ్యూజిక్ చేయాలి. నా పరంగా అంటే వెస్ట్రన్ సౌండ్స్, ప్రోగ్రామింగ్ అండ్ వెస్ట్రన్ సాంగ్స్ లో స్పెషలిస్ట్.

ప్రశ్న) మీ ఫ్యామిలీ మొత్తం సంగీతానికి చెందినది.. మీలో ఎప్పుడు ఇలా మ్యూజిక్ పై ఆసక్తి కలిగింది.?

స) నా చిన్నప్పుడే తాత గారికి రికార్డింగ్ థియేటర్స్ ఉండేవి, అక్కడికి వెళ్ళేవాడిని. అలాగే నాన్నగారు కూడా నన్ను రికార్డింగ్స్ కి తీసుకెళ్ళే వారు. నాకు చిన్నప్పటి నుంచే సంగీతం అంటే ఇష్టం, అలాగే నేను చాలా చిన్న ఏజ్ నుంచే సంగీతం నేర్చుకోవడం మొదలు పెట్టాను.

ప్రశ్న) మీరు నాన్నగారి దగ్గర కాకుండా చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పనిచేసారు. మీ మ్యూజిక్ లో ఎవరి ప్రభావం ఎక్కువ ఉంటుంది.? అలాగే మీకు ఎవరి మ్యూజిక్ అంటే ఇష్టం.?

స) నా మ్యూజిక్ లో ఒక 80% నాన్నగారి ప్రభావమే ఉంటుంది. ఆ తర్వాత కళ్యాణి మాలిక్ గారి ప్రభావం ఉంటుంది. ఎందుకంటే నాన్న గారి తర్వాత ఎక్కువగా నేను కళ్యాణి మాలిక్ దగ్గరే పనిచేసాను. నాకు నాన్న గారు, కళ్యాణి గారి మ్యూజిక్ అంటే ఇష్టం. వీరిద్దరూ కాకుండా యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కి నేను పెద్ద ఫ్యాన్.

ప్రశ్న) ‘గోలచేద్దామే’ పాట అచ్చం మణిశర్మ గారి పాటలనే ఉందని అంటున్నారు. దాని పై మీ కామెంట్.?

స) తప్పకుండా మణిశర్మ గారి పాటలా ఉండాలి, ఉంటుంది కూడా.. ఎందుకు అంటే మనం ఎవరిదగ్గరి నుంచైతే ఓ విషయం నేర్చుకుంటామో అందులో వారి ప్రభావం ఉంటుంది. అలా నేను మ్యూజిక్ మొత్తం నాన్న గారి దగ్గరి నుంచే నేర్చుకున్నాను. అలాంటప్పుడు ఆయన ఫ్లేవర్ లేకుండా ఎలా ఉంటుంది. నేను దీన్నొక కాంప్లిమెంట్ లా తీసుకుంటాను.

ప్రశ్న) మీ సినిమా విషయంలో మణిశర్మ గారి ఇన్వాల్వ్ మెంట్ ఎంత వరకూ ఉంటుంది.?

స) కచ్చితంగా ఆయన ఇన్వాల్వ్ మెంట్ ఉంటుంది. నేను కంపోజ్ చేసిన ప్రతి పాటని ఆయనకి వినిపించి సలహాలు తీసుకునే వాన్ని.. ఆయన నాకొక గైడ్ లైన్.

ప్రశ్న) మొదటి సినిమా అయిన జాదూగాడు టీం తో జర్నీ ఎలా ఉంది.?

స) చాలా సూపర్బ్ గా ఉంది.. ఒక చిన్న పిల్లాడు ఎదగడానికి అమ్మ నాన్న సపోర్ట్ ఎంత అవసరమో, నా లాంటి కొత్త వారికి డైరెక్టర్, నిర్మాత సపోర్ట్ అంత అవసరం. నాకు వారు ఇచ్చిన సపోర్ట్ వల్లే నేను ఈ సినిమా చేయగలిగాను. వారు నాకు ఆఫర్ ఇవ్వడమే కాకుండా, నన్ను ఎంతో నమ్మారు. వారి నమ్మకాన్ని నిలబెట్టేలా మ్యూజిక్ ఇచ్చానని అనుకుంటున్నాను.

ప్రశ్న) ఆడియో వేడుకలో తప్ప మ్యూజిక్ డైరెక్టర్స్ మిగతా ప్రమోషన్స్ లో కనపడడం చాలా తక్కువ. మీరు కూడా వారిలా అదే బాక్స్ లో ఉండిపోతారా లేక అవుట్ అఫ్ ది బాక్స్ వస్తారా.?

స) నా వరకూ ఆ బాక్స్ నుండి బయటకి వాడడం అనే అనుకుంటున్నాను. వారందరూ రాకూడదు అని కాదండి, వారి వర్క్ బిజీ వల్ల రాలేరు అంతే. నాకు తెలిసి అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ అలానే ఉన్నారు, నాకు నాన్నగారు కూడా అస్సలు ఈవెంట్స్ కి అటెండ్ అయ్యేవారు కాదు. బయట రాకూడదని కాదు, వర్క్ వల్ల రాలేము.

ప్రశ్న) మీ తదుపరి సినేమాలేమిటి.?

స) జాదూగాడు తర్వాత చేయనున్న రెండవ సినిమాకి సైన్ చేసాను. ఎస్.వి.కె పిక్చర్స్ బ్యానర్ లో మధు డైరెక్ట్ చేసే సినిమాకి మ్యూజిక్ చేస్తున్నాను.

తాజా వార్తలు