ఇంటర్వ్యూ : ఎట్టకేలకు పూరి దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చింది- శ్రీయ
Published on Aug 30, 2017 7:44 pm IST


వయసు ముప్పై ఏళ్లు దాటినా కూడా శ్రీయ శరన్ హీరోయిన్ గా మంచి అవకాశాలను అందుకుంటోంది. గౌతమి పుత్ర శాతకర్ణి తరువాత వరుసగా రెండవ సారి బాలయ్య సరసన పైసా వసూల్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్ర విడుదల సందర్భంగా శ్రీయ తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు చూద్దాం..

ప్ర ) పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పనిచేయడం ఎలా అనిపించింది ?

జ) పూరి దర్శకత్వంలో నటించాలని ఎప్పుడూ కోరుకునేదాన్ని. కానీ ఎందుకో అది కుదరలేదు. పైసా వసూల్ చిత్రం ద్వారా ఆ అవకాశం లభించింది. పూరిజగన్నాథ్ చాలా సరదాగా ఉంటారు.

ప్ర ) ఈ చిత్రంలో మీ పాత్ర గురించి ?

జ) ఈ సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తాను. నా పాత్ర తేడా సింగ్ పాత్రతో లింక్ అయి ఉంటుంది. సినిమాలో దీనిని చూపించిన విధానం ఆసక్తి కరంగా ఉంటుంది.

ప్ర ) బాలయ్యతో కలసి నటించడం గురించి ?

జ) ఆయనతో కలసి నటించిన ప్రతిసారి చాలా ఉత్సాహంగా ఉంటుంది. రీసెంట్ గా గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రంలో కూడా నటించాను. పైసావసూల్ సినిమాలో మా ఇద్దరి రోల్స్ చాలా సరదాగా ఉంటాయి. బాలయ్య పాత్ర అందరిని ఆకట్టుకుంటుందని నమ్మకంగా చెప్పగలను.

ప్ర ) టాలీవుడ్ లో చాలా కాలం నుంచి ఉన్నారు. ఎలాంటి మార్పులు గమనించారు ?

జ) ‘అర్జున్ రెడ్డి’ వంటి విభిన్న చిత్రాలు వస్తున్నాయి. ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారని అర్థం అవుతోంది. టాలీవుడ్ లో ప్రస్తుతం అందరి పాత్రలకు గుర్తింపు ఉండే సినిమాలు వస్తున్నాయి.

ప్ర ) మీరు కథలను ఎలా ఎంపిక చేసుకుంటారు ?

జ) దర్శకుడిని బట్టే. నా వరకు దర్శకుడే ముఖ్యం. దర్శకుడి ఐడియాలజీ, నా పాత్రని చూపించే విధానం నచ్చితే చాలు. ఎలాంటి హీరో, ఎలాంటి బ్యానర్ అనే విషయాలను పెద్దగా పట్టించుకోను.

ప్ర ) మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ల గురించి ?

జ) 23 ఏళ్ల కొత్త దర్శకుడితో ఓ చిత్రంలో నటించబోతున్నాను. సైకో థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రం రూపొందబోతోంది. సరికొత్త రోల్ లో ఈ చిత్రంలో కనిపిస్తాను.

 
Like us on Facebook