ఇంటర్వ్యూ : స్వాతి – నా వెయిట్ గురించి కామెంట్స్ చేస్తున్నారని నాకు తెలుసు.

ఇంటర్వ్యూ : స్వాతి – నా వెయిట్ గురించి కామెంట్స్ చేస్తున్నారని నాకు తెలుసు.

Published on Nov 4, 2015 2:11 PM IST

swathi
కలర్స్ అంటూ బుల్లితెరపై మెరిసి ఆ తర్వాత తెలుగమ్మాయిగా వెండితెరకు పరిచయమైన హీరోయిన్ స్వాతి. స్వామి రారా, కార్తికేయ లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న స్వాతి నటించిన లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘త్రిపుర’. ఈ సినిమా నవంబర్ 6న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా త్రిపుర ఆన్ స్క్రీన్ ఏం చేయనుందా అనే విషయాలను తెలుసుకున్నాం. ఆ విశేషాలు మీకోసం..

ప్రశ్న) మీ ప్రతి తెలుగు సినిమాకి అంతలా గ్యాప్ ఎందుకు తీసుకుంటున్నారు?
స) నేను తెలుగుతో పాటు మలయాళం, తమిళ సినిమాలు కూడా చేస్తూ వస్తున్నాను. అవి చేస్తున్న టైంలో తెలుగు సినిమాలకి టైం దొరకలేదు. అందుకే తెలుగుకి కాస్త గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది.

ప్రశ్న) త్రిపుర సినిమా ఎలా ఉండబోతుంది?
స) సూపర్ నాచురల్ పవర్స్ మరియు హర్రర్ ఎలిమెంట్స్ ని మిక్స్ చేసిన కంప్లీట్ ఎంటర్టైనర్ ‘త్రిపుర’. హౌస్ వైఫ్ పాత్రలో కనిపిస్తాను. నాకు వచ్చే కలలు రియల్ లైఫ్ లో నిజం అవుతుంటాయి. అలాంటి అమ్మాయి లైఫ్ ఎలా ముగిసింది అనేదే ఈ త్రిపుర.

ప్రశ్న) మొదటిసారి చేసిన లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ అనుభూతి ఎలా ఉంది?
స) కమర్షియల్ సినిమాల షూటింగ్ తో పోల్చుకుంటే ఇలాంటి సినిమా చేయడం చాలా కష్టతరమైనది. అలాగేపాటలు , డాన్సులతో పాటు హర్రర్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా నాకు చాలా కొత్త, అందుకే సినిమా షూట్ మొత్తాన్ని చాలా బాగా ఎంజాయ్ చేసాను.

ప్రశ్న) మీరు నిజ జీవితంలో సూపర్ నాచులర్ పవర్స్ గురించి నమ్ముతారా?
స) పెద్దగా నమ్మను.. నాకు నిద్రలో కొన్ని భయంకరమైన కలలు వస్తాయి, కానీ లేచాక అవన్నీ మరచిపోతూ ఉంటాను.

ప్రశ్న) ట్రైలర్స్ చూస్తుంటే.. త్రిపుర సినిమా కోసం బాగా లావు అయినట్టున్నారు?
స) నవ్వులు.. ఈ మధ్య నేను ఎక్కడికా వెళ్ళినా ఇదే కామెంట్ ని ఎక్కువగా వింటూ ఉన్నాను. ఈ సినిమాలో నేను కాస్త వయసు ఎక్కువ ఉన్న ఇన్నోసెంట్ అమ్మాయిగా కాస్త బొద్దుగా కనిపించాలి. అందుకే ఈ సినిమా కోసం 6 కిలోల బరువు పెరిగాను. సినిమా రిలీజ్ అయిపోయాక వెంటనేతగ్గిపోతాను . దానికి ప్రిపేర్ అయ్యే ముందు వెయిట్ పెరిగాను.

ప్రశ్న) చాలా చోట్ల త్రిపుర సినిమా గీతాంజలికి సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది. దానిపై మీకామెంట్ .?
స) కాదు కానే కాదు.. నేను అలాంటి వార్తలు వింటున్నాను కానీ గీతాంజలికి త్రిపుర సీక్వెల్ కాదు. అలాగే కంటెంట్ పరంగా కూడా చాలా తేడా ఉంటుంది. గీతాంజలి కంటే ఎక్కువగా ఈ సినిమా మెప్పిస్తుంది.

ప్రశ్న) ఎందుకు మీరు చాలా సెలక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటున్నారు.?
స) నా పరంగా నేను వరుస ఆఫర్స్ తో ఎప్పుడు బిజీ గానే ఉన్నా.. నా దగ్గరికి వచ్చిన కథల్లో నాకు ది బెస్ట్ అనిపించిన దాన్ని తీసుకొని, చేసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ నేనేదో గ్రేట్ గా చేసెయ్యాలి అనుకోవడం లేదు. అలాగే ప్రస్తుతం నా స్టేజ్ ని బాగా ఎంజాయ్ చెస్తునాను. ఇలా సినిమాలు చేయడం వలన మా పేరెంట్స్ తో స్పెండ్ చెయ్యడానికి కాస్త టైం దొరుకుతోంది.

ప్రశ్న) గీతాంజలి సినిమాని మీకోసం, త్రిపుర సినిమాని అంజలి కోసం రాసారని అంటున్నారు. దానిపై మీ కామెంట్?
) నాకు తెలిసి నేనెప్పుడు వినలేదు ఈ న్యూస్.. నేను ఒకటే కోరుకుంటున్నా నా త్రిపుర సినిమా ఆడియన్స్ ని మెప్పించి బాగా ఆడాలి.

ప్రశ్న) మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి. పెళ్లి ఎప్పుడు చేసుకునే ఆలోచనలో ఉన్నారు?
స) ప్రస్తుతం నాకు ఒకదాని తర్వాత మరొకటి అన్న తరహాలో ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. అలాగే పర్సనల్ గా కూడా హ్యాపీ. నాకు ఎవరన్నా నచ్చి, ఇక నేను లైఫ్ లో సెటిల్ అయిపోవాలి అనిపించినప్పుడు పెళ్లి చేసేసుకుంటాను. అప్పటి వరకూ నో పెళ్లి.

తాజా వార్తలు