ఇంటర్వ్యూ : వివి వినాయక్ – అఖిల్ సోషియో ఫాంటసీ సినిమా కాదు.

ఇంటర్వ్యూ : వివి వినాయక్ – అఖిల్ సోషియో ఫాంటసీ సినిమా కాదు.

Published on Nov 6, 2015 2:50 PM IST

vv-vinayak
ఆది అనే మొదటి సినిమాతోనే తెలుగు సినిమా రికార్డ్స్ బద్దులు కొట్టిన డైరెక్టర్ వివి వినాయక్. కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిన వివి వినాయక్ అక్కినేని ఫ్యామిలీ మూడవతరం నట వారసుడు అఖిల్ అక్కినేనిని హీరోగా పరిచయం చేస్తూ చేసిన సినిమా ‘అఖిల్’. ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడి అఖిల్ పై వస్తున్న రూమర్స్ గురించి, రిలీజ్ ఆలస్యానికి గల కారణం గురించి తెలుసుకున్నాం. ఆ విశేషాలు మీకోసం..

ప్రశ్న) అఖిల్ వాయిదా అనగానే అభిమానుల ఆగ్రహానికి గురయినట్టున్నారు?
స) అఖిల్ సినిమాపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే మేము దసరా నుంచి వాయిదా అనగానే వారు బాధతో కూడిన ఆగ్రహానికి లోనయ్యారు. కానీ నాగార్జున గారు ప్రెస్ మీట్ ద్వారా అసలు విషయాన్ని చెప్పినప్పుడు కూల్ అయ్యారు. వర్క్ ఫినిష్ చేసి దీపావళి రిలీజ్ అనగానే వారు ఖుషీ అయిపోయి, సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఈ వాయిదా వల్ల దసరాకి అనుకున్న దానికంటే ఎక్కువ థియేటర్స్ లో అఖిల్ రిలీజ్ అవుతోంది.

ప్రశ్న) అఖిల్ వాయిదాకి గల కారణం నాగ్ చెప్పినా, పలు వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటికి మీ క్లారిటీ ఏంటి?
స) అఖిల్ సినిమా నిడివి 2 గంటల 10 నిమిషాలు. ఇందులో చివరి 10 నిమిషాల్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ మొత్తం గ్రాఫిక్స్ లో ఉంటుంది. ఆ ఎపిసోడ్ లో గ్రాఫిక్స్ సరిగా రాలేదని మాకనిపించింది. నాగార్జున గారు కూడా సినిమా చూసి 2 గంటలు సూపర్బ్ గా ఉండి, ఈ 10 నిమిషాలు మాత్రం ఎందుకిలా క్వాలిటీ లేకుండా, మళ్ళీ సిజి చేయిద్దాం అని ప్రోత్సహించడంతో డిక్యూ ఎంటర్టైన్మెంట్స్ వారితో కలిసి సిజి వర్క్ ని బెస్ట్ క్వాలిటీతో ఫినిష్ చేసాం. అంతే కానీ రీ షూట్ అనేది అస్సలు చేయలేదు.

ప్రశ్న) ఇప్పడు అంతా సిద్దం.. సో అఖిల్ అనే సినిమా ఎలా ఉంటుందని ఆశించవచ్చు?
స) బయట అందరూ అఖిల్ అనేది ఓ సోషియో ఫాంటసీ సినిమా అనుకుంటున్నారు. కానీ ఇది మాత్రం లవ్, యాక్షన్, కామెడీ అన్నీ కలగలిపిన పర్ఫెక్ట్ కామెడీ ఎంటర్టైనర్. భూమధ్య రేఖకి దగ్గరలో ఆఫ్రికా ఖండంలోని ఓ తెగకు చెందిన ప్రజల చుట్టూ తిరిగే కథే ఈ అఖిల్. అక్కడి వారు సూర్యున్ని జువా అంటారు. సూర్యుడికి వీళ్ళకి కనెక్షన్ ఉంటుంది. అందుకే పవర్ అఫ్ జువా అనే ట్యాగ్ లైన్ పెట్టాం.

ప్రశ్న) స్టార్ కొడుకు అని మీరు, ఫస్ట్ మూవీ అని అఖిల్ బాగా ప్రెజర్ తీసుకున్నట్టున్నారు?
స) మనం సినిమాలో అఖిల్ ని చూసినప్పుడే తనతో సినిమా చేయాలని అనుకున్నా, అప్పటికే నా దగ్గర ఉన్న ఈ కథ చెప్పగానే అఖిల్ ఫస్ట్ మూవీని నా చేతిలో పెట్టేసారు. దాంతో స్టార్ హీరో కుమారిడి లాంచ్ అనే టెన్షన్ నా బ్రెయిన్ లో ఎప్పుడూ ఉండేది. కానీ నిర్మాత సుధాకర్ రెడ్డి వల్ల కాస్తే టెన్షన్ ఫ్రీ అయ్యాను. అఖిల్ కి కూడా అభిమానుల అంచనాలను రీచ్ అవ్వాలనే టెన్షన్ ఉంది. కానీ లాంటి ప్రెజర్, టెన్షన్ తీసుకుంటేనే అతను స్టార్ హీరో అవ్వగలడని నా భావన.

ప్రశ్న) అఖిల్ సినిమా జర్నీలో అఖిల్ లో మీరు గమనించిన క్వాలిటీస్ ఏంటి?
స) మొదట్లో నేను అఖిల్ తన ఫాదర్ నాగార్జునని ఫాలో అవుతూ అలానే చేస్తాడేమో అనుకున్నాను. కానీ అఖిల్ మాత్రం తనకంటూ ఒక యునిక్ స్టైల్ క్రియేట్ చేసుకోవాలనుకున్నాడు. దానికోసం యాక్షన్, కామెడీ, డాన్సుల్లో ఎక్కువ హార్డ్ వర్క్ చేసాడు. ఎంత రిస్క్ షాట్స్ అయినా బాలేకపోతే మళ్ళీ చేద్దాం అని చేసేవాడు. కామెడీ టైమింగ్ లో బ్రహ్మానందం కి ఈక్వల్ గా పంచ్ లు వేసాడు. సినిమా అంటే కమిట్మెంట్, డెడికేషన్ ఉన్న కుర్రాడు. కమర్షియల్ హీరోకి కావాల్సిన అన్ని లక్షణాలు అఖిల్ లో ఉన్నాయి. ఫస్ట్ సినిమాతో అందరినీ థ్రిల్ చేస్తాడు.

ప్రశ్న) ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నా మణిశర్మని ఎంచుకోవడానికి కారణం?
) ఇద్దరు ఉన్నప్పటికీ ఇలాంటి కమర్షియల్ సినిమాకి మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంటుందని నిర్మాత సుధాకర్ రెడ్డిగారు చెప్పగానే నాకు నచ్చి ఓకే చెప్పేసాను.

ప్రశ్న) అఖిల్ సరసన కొత్త హీరోయిన్ సయేషాని తీసుకోవాలనే ఆలోచన ఎవరిది?
స) సయేషా సెలక్షన్ కూడా అనుకోకుండా జరిగింది. ముంబైలో ఉండే సుధాకర్ రెడ్డిగారి ఫ్రెండ్ శివ దిలీప్ కుమార్ మనవరాలు ఒకమ్మాయి ఉంది, తనని చూడండి అని చెబితే చూసాం.. చూసిన వెంటనే ఫైనలైజ్ చేసేసాం. సయేషా మంచి పెర్ఫార్మర్ మరియు డాన్సర్.

ప్రశ్న) హీరోని ప్రెజంట్ చేయడంలో వినాయక్ తర్వాతే ఎవరన్నా అని మహేష్ ఇచ్చిన కితాబుపై మీ కామెంట్?
స) బిట్ ఇవ్వండి అని అడిగితే ఆడియో లాంచ్ కె వస్తానని మహేష్ అనడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అది సరిపోదన్నట్టు ఆయన స్టేజ్ పై ఇచ్చిన ఆ కాంప్లిమెంట్ ఆయనకు నా మీద ఉన్న అభిమానం తెలిసింది. త్వరలోనే ఆయనపై 100కోట్ల బడ్జెట్ తో ఓ సినిమా చేస్తాను.

ప్రశ్న) మీ నెక్స్ట్ మూవీ చిరంజీవి గారు చేస్యబోయే 150వ సినిమానేనా.?
స) నవ్వుతూ.. నేను చాలా కాజువల్ గా ఆయన్ని కలుస్తూనే ఉంటాను. అంతే కానీ పర్టిక్యులర్ గా సినిమా గురించి కలవలేదు. ఆయనతో 150వ సినిమా చేస్తానా లేదా అన్నదానిపై ప్రస్తుతానికి నో కామెంట్స్.

తాజా వార్తలు