ఇంటర్వ్యూ : వరుణ్ తేజ్ – ఆ ఛాన్స్ వస్తే చిరు గారి ‘ఛాలెంజ్’ సెలక్ట్ చేసుకుంటాను.

Published on Dec 15, 2015 2:00 pm IST

Varun-tej
‘ముకుంద’, ‘కంచె’ సినిమాలతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న వరుణ్ తేజ్ మొదటి సారి మాస్ హీరోగా మారి చేస్తున్న మాస్ మసాలా ఎంటర్టైనర్ ‘లోఫర్’. పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా డిసెంబర్ 17న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కాసేపు వరుణ్ తేజ్ తో మాట్లాడి, లోఫర్ విశేషాలను, తన తదుపరి సినిమాల గురించి కనుక్కున్నాం. ఆ విశేషాలు మీకోసం..

ప్రశ్న) మొదటి రెండు సినిమాలు క్లాస్ టైటిల్స్ తో చేసి, ఒక్కసారిగా లోఫర్ అనే టైటిల్ వినగానే మీకేమనిపించింది?

స) ఫస్ట్ నాకు కథ చెప్పారు, వారం తర్వాత టైటిల్ చెప్పారు. మొదట నేను కూడా ఆ పేరు విన్నప్పుడు షాక్ అవ్వడమే కాకుండా ఈ టైటిల్ ఏంటి అని ఆలోచించాను. కానీ సెట్లోకి వెళ్లి సీన్స్ చేస్తున్నప్పుడు ఆ టైటిల్ సినిమాకి పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యాను. లోఫర్ అనే టైటిల్ ఏంది అనే నెగటివ్ ఫీలింగ్ లో ఉన్నవారు సినిమా చూసాక టైటిల్ పర్ఫెక్ట్ అని అంటారు.

ప్రశ్న) ‘లోఫర్’ సినిమా ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏమిటి?

స) లోఫర్ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ తల్లి – కొడుకుల మధ్య నడిచే ఎమోషనల్ బాండింగ్, మెయిన్ గా సెంటిమెంట్ సీన్స్ నాలుగైదు ఉంటాయి. అవి విన్నప్పుడు నన్ను బాగా టచ్ చేసాయి. రిలీజ్ అయ్యాక ఆడియన్స్ కూడా టచ్ అవుతుందనుకుంటున్నాను. మదర్ గా రేవతి గారు ఫెంటాస్టిక్ అనిపించారు.

ప్రశ్న) మీరు మొదటి సారి మాస్ రోల్ చేస్తున్నారు. ఈ రోల్ కోసం మీరు తీసుకున్న స్పెషల్ కేర్ ఏంటి?

స) ఈ సినిమాలో నేనొక దొంగగా కనిపిస్తాను. దానికోసం నా లుక్ పరంగా కాస్త కేర్ తీసుకున్నాను. ఇక పాత్రని చేయడంలో మాత్రం నేను సింపుల్ గా సెట్ కి వెళ్లి పూరి గారు ఏం చెప్తే అది చేసాను.

ప్రశ్న) గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?

స) గత రెండు సినిమాల్లో నేను మాట్లాడింది చాల అతక్కువ, కానీ ఇందులో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను, యాక్షన్, డాన్సులు అన్నీ చేసాను. పూరి గారి సినిమాల్లో ఉండే టిపికల్ హీరోలా నేను కనిపిస్తాను. ఇలాంటి పాత్ర చేయడం నాకో మంచి అనుభవం.

ప్రశ్న) వాంటెడ్ గా డిఫరెంట్ సినిమాలు ఎంచుకుంటున్నారా? లేక వేరే ప్రత్యేక రీజన్ ఏమన్నా ఉందా?

స) వాంటెడ్ గా ఏమీ చెయ్యడం లేదండి. నా దగ్గరి ఆ ఆఫర్స్ వచ్చాయి చేసాను. అదీ కాక నాకు పర్టిక్యులర్ గా కమర్షియల్ లేదా మాస్ హీరో అనే ముద్ర వేసుకోవడం ఇష్టం లేదు. అందరూ నన్నొక మంచి యాక్టర్ గా గుర్తు పెట్టుకోవాలి. అందుకే సినిమా సినిమా వైవిధ్యం ఉండేలా చూసుకుంటున్నాను.

ప్రశ్న) ఈ సినిమా విషయంలో బాగా టఫ్ గా అనిపించిన సీన్స్ ఏమన్నా ఉన్నాయా?

స) ఈ సినిమాలో సువ్వీ సువ్వీ సాంగ్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. మొదటి రోజు ఈ సాంగ్ చేయలేకపోయాను. దాంతో పూరి గారు అర్థం చేసుకొని ఆ రోజు షూట్ రద్దు చేసారు. తర్వాత రోజు పూరి గారు చెప్పిన దాని ప్రకారం చేసాను.

ప్రశ్న) మెగా ఫ్యామిలీలో చాలా మంది హీరోస్ ఉన్నారు. మీరందరూ కలిసి మల్టీ స్టారర్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా?

స) ఈ టాపిక్ మా మధ్య కూడా చాలా సార్లు వచ్చింది. చరణ్ అన్నయ్య అయితే మనం కలిసి ఓ సినిమా చేయచ్చు కదా అని అకూడా న్నారు. అన్నీ కుదిరితే కచ్చితంగా చేస్తాము.

ప్రశ్న) చిరు గారి సినిమాల్లో రీమేక్ కోసం ఓ సినిమా సెలక్ట్ చేసుకోమంటే, ఏ సినిమా సెలక్ట్ చేసుకుంటారు?

స) నాకు పెదనాన్న గారి ‘ఛాలెంజ్’ అంటే చాలా ఇష్టం, నాకు ఆ ఛాన్స్ వచ్చి, రీమేక్ చేయాల్సి వస్తే ఛాలెంజ్ సినిమా సెలక్ట్ చేసుకుంటాను. ఇంకా చెప్పాలంటే ఆ సినిమా నా మనసుకు దగ్గరగా ఉంటుంది.

ప్రశ్న) మీ నెక్స్ట్ సినిమాల గురించి చెప్పండి?

స) ప్రస్తుతానికైతే నా లుక్ మార్చుకోవడం కోసం ఒక మూడు నెలలు గ్యాప్ తీసుకోవాలి అనుకుంటున్నాను. అలాగే క్రిష్ ఓ కథ చెప్పాడు. ఎక్కువ భాగం నెక్స్ట్ అదే సినిమా ఉండచ్చు. మిగతా కథలు కూడా వింటున్నాను.

 

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం :