ఇంటర్వ్యూ: ఉషా మూల్పూరి- అందుకే అశ్వథామ ప్రాణం పెట్టి తీశాం.

ఇంటర్వ్యూ: ఉషా మూల్పూరి- అందుకే అశ్వథామ ప్రాణం పెట్టి తీశాం.

Published on Feb 1, 2020 3:38 PM IST

నాగ శౌర్య, మెహ్రీన్ జంటగా దర్శకుడు రమణ తేజ తెరకెక్కించిన చిత్రం అశ్వథామ. నిన్న విడుదలైన ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ దక్కించుకుంటుంది. దీనితో అశ్వథామ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత మరియు నాగ శౌర్య మదర్ ఉషా మూల్పూరి పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.

 

మంచి కథతో వచ్చారు, రెస్పాన్స్ ఎలా ఉంది?

అశ్వథామ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ చాలా బాగుంది. నాగ శౌర్య కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్స్ కాల్స్ చేసి మూడు నాలుగు వరాలు మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. యూత్, కాలేజీ స్టూడెంట్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.

 

ఐరా క్రియేషన్స్ లో వచ్చిన నర్తనశాల చిత్ర ఫలితం మీపై ఎలాంటి ప్రభావం కలిగించింది?

నిజంగా నర్తనశాల మాకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. అది నాగ శౌర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్. నాగ శౌర్య, నేను చాలా బాధపడ్డాం. అందుకే అశ్వథామ ప్రాణం పెట్టి తీశాం.

 

కమర్షియల్ హీరోగా నాగశౌర్య కి ఈ చిత్రంతో గుర్తింపు వస్తుంది అంటారా?

అశ్వథామ చిత్రం తరువాత కమర్షియల్ చిత్రాలకు నాగ శౌర్య కూడా ఒక ఆప్షన్ అయ్యాడు. నాగ శౌర్య లోని మాస్ యాంగిల్ అందరికీ బాగా నచ్చింది. నిజానికి నాగశౌర్య చాలా రెబెల్, పైకి కనిపించేలా సాఫ్ట్ కాదు. అతను నటించిన సినిమాల వలన క్యూట్ లవ్ బాయ్ ఇమేజ్ వచ్చింది.

 

నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నారు ?
కథలు వింటున్నాము. కథను బట్టి ఎవరికి సూటైతే వారితో చేస్తాము. మా అబ్బాయితోనే సినిమా చేయాలనే నియమం ఏమి లేదు.

 

కథలు రాస్తున్న నాగ శౌర్య త్వరలో డైరెక్షన్ కూడా చేసే అవకాశం ఉందా?
నాగ శౌర్య హీరో అవుతాడని మేము అనుకోలేదు, అయ్యాడు. ఇప్పుడు రచయిత కూడా అయ్యాడు, ఏది అనుకోని జరగలేదు. ఒకవేళ డైరెక్షన్ కూడా చేయాలని దేవుడు తలిస్తే, చేస్తాడేమో.

 

సక్సెస్ టూర్స్ ఏమైనా ఉన్నాయా?

సక్సెస్ టూర్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఇవాళ నాగ శౌర్య ఏలూరు, భీమవరం, విజయవాడ లోని కొన్ని దియెటర్లు, కాలేజీలకు వెళ్లనున్నారు. అలాగే ప్రముఖులతో కొన్ని ఇంటర్వ్యూలు కూడా ప్లాన్ చేశాం.

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు