ఇంటర్వ్యూ: ప్రియదర్శి- కామెడీ చేయడం అంత తేలికకాదు..!

Published on May 12, 2020 3:48 pm IST

కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలక్షణ పాత్రలు చేస్తున్న నటుడు ప్రియదర్శి. గత ఏడాది మల్లేశం సినిమాతో సోలో హీరోగా కూడా మారాడు. ఆయన నటించిన బ్రోచేవారెవరురా మంచి విజయాన్ని అందుకుంది. మరి ఈ లాక్ డౌన్ సమయంలో ప్రియదర్శి ఏమి చేస్తున్నాడో? ఆయన డ్రీం రోల్స్ ఏమిటో? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమిటో అడిగి తెలుకోవడం జరిగింది. ఆ విశేషాలు మీ కోసం…

 

మల్లేశం సినిమాకు ఓ టి టి లో స్పందన ఎలా ఉంది?

చాలా బాగుంది. థియేటర్స్ లో మిస్ అయినవారు అనేక మంది ఓ టి టి ప్లాట్ ఫార్మ్ లో ఈ సినిమాను చూస్తున్నారు. అలాగే చాలా మంది బాగుంది అంటూ నాకు మెస్సేజ్ లు చేస్తున్నారు. ఈ స్పందన మంచి అనుభూతిని ఇస్తుంది. మల్లేశంలో నటించడం వలన నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాను.

 

సినిమాల విషయంలో సెలెక్టివ్ గా ఉంటున్నారా?

అలా ఏమీ కాదు, నేను నటించిన చాలా సినిమాలు లాక్ డౌన్ కారణంగా విడుదల కాకుండా వున్నాయి. అందుకే మీకు అలా అనిపించి ఉండవచ్చు. ప్రస్తుతం నేడు జాతి రత్నాలు, నాంది చిత్రాలతో పాటు ప్రభాస్, శర్వానంద్ చిత్రాలలో కీలక రోల్స్ చేస్తున్నాను. అలాగే నేను నటించిన లూజర్ అనే వెబ్ సిరీస్ ఈ వారంలో విడుదల కానుంది.

 

మీ లూజర్ వెబ్ సిరీస్ గురించి ఏమి చెవుతారు?

నిజంగా లూజర్ వెబ్ సిరీస్ నన్ను చాలా ఎక్సయిట్మెంట్ కి గురిచేసింది. అనేక ఒడిదుడుకులకు లోనై తన లక్ష్యం చేరుకున్న ఓ ఎయిర్ రైఫిల్ షూటర్ రోల్ చేస్తున్నాను. ఈ సిరీస్ లో మరో రెండు ప్రధాన పాత్రలు ఉన్నాయి. వీరందరికీ ఉన్న సంభంధం ఏమిటనేది ఈ సిరీస్ లో ఆసక్తిగొలిపే అంశం. ఇది ఒక ఛాలెంజింగ్ రోల్ అందుకే గగన్ నారంగ్ షూటింగ్ అకాడమీ నందు కొన్నాళ్ళు శిక్షణ తీసుకున్నాను.

 

కెరీర్ పట్ల సంతృప్తికరంగా ఉన్నారా?

ఫస్ట్ నేను వెండితెరపై కనిపిస్తే చాలు అనుకున్నాను అది జరిగింది. ఆతరువాత నేను నటించిన సినిమా మంచి విజయం సాధించాలి అనుకున్నాను, అది పెళ్లి చూపులు సినిమాతో అయ్యింది. ఇక భిన్నమైన రోల్స్ చేయాలనుకున్నాను, అది మల్లేశం సినిమాతో సాకారం అయ్యింది. నాకు ఇంకా కొన్ని గోల్స్ ఉన్నాయి.. అయినప్పటికీ సంతృప్తి కరంగానే ఉన్నాను.

 

ఇంతకీ మీరు కమెడియనా లేక క్యారెక్టర్ ఆర్టిస్టా?

చాలా మంది నన్ను ఈ ప్రశ్న అడుగుతారు…మిమ్ముల్ని ఏమని పిలవాలి కమెడియనా లేక క్యారెక్టర్ ఆర్టిస్టా అని. ఐతే నాకు అన్ని రకాల పాత్రలు చేయగల వెర్సిటైల్ యాక్టర్ అనిపించుకోవాలని. లూజర్ లో నేను చేస్తున్నది అలాంటి ఛాలెంజింగ్ రోలె.

 

మీ డ్రీం రోల్స్ ఏమిటీ?

డ్రీం రోల్స్ అంటూ ఏమి లేవు గాని, నాకు విలన్ రోల్స్ చేయాలని ఉంది. ఒక నటుడిగా నిరూపించుకోవాలంటే అలాంటి పాత్రలు చేయాలి. చాలా మంది కామెడీ చేయడం చాలా ఈజీ అనుకుంటారు, కానీ అది చాలా కష్టమైన పని. ఇక నేను ఇర్ఫాన్ ఖాన్ కి పెద్ద ఫ్యాన్ ని. ఆయనలాగే ఏజ్ తో సంబంధం లేకుండా అన్ని రకాల పాత్రలు చేయాలి.

 

వైవాహిక జీవితం ఎలా ఉంది?

చాలా బాగుంది. నా భార్య నేను హ్యాపీ లైఫ్ అనుభవిస్తున్నాం. వృత్తి పరంగా ఎవరి వ్యాపాకాలు వారివి అయినా ఇద్దరం ఒకరి అభిప్రాయాలు మరొకరం గౌరవిస్తాం.

 

లాక్ డౌన్ అనంతరం మీరు చేసే మొదటి పని ఏమిటీ?

షూటింగ్ కి హాజరుకావాలి. ఇప్పటికే చాలా పని పెండింగులో ఉండిపోయింది. దానితో పాటు సన్నిహితులతో కలిసి ఓ లావిష్ డిన్నర్ కి వెళ్ళాలి.

సంబంధిత సమాచారం :

X
More