ఇంటర్వ్యూ: కె ఎస్ రవీంద్ర(బాబీ)- మామ అల్లుళ్ళ ఎమోషన్స్ ఈ చిత్రానికి హైలెట్.

Published on Dec 6, 2019 5:35 pm IST

సురేష్ బాబు నిర్మాతగా దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వెంకీ మామ. వెంకటేష్, నాగ చైతన్య మామ అల్లుళ్లుగా చేస్తున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈనెల 13న చిత్ర విడుదల నేపథ్యంలో దర్శకుడు బాబీ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ చిత్ర విశేషాలు మీకోసం…

 

వెంకీ మామ చిత్రం ఎలా కార్యరూపం దాల్చింది?

కోనా వెంకట్ గారు సురేష్ బాబుగారి దగ్గర ఒక కథ ఉంది, చేస్తారా అని అడిగారు. ఐతే నేను రైటర్ కాబట్టి ఒకరి కథను నేను చేయను అని చెప్పాను. కానీ తరువాత సురేష్ బాబు గారు పిలిపించి మొత్తం చెప్పి, ప్రాజెక్ట్ ఇష్టం ఐతే డీల్ చేయమన్నారు. కొన్ని మార్పులు చేర్పులు అనంతరం ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది.

 

మామ అల్లుళ్లు చిత్రంలో ఏమి చూపించబోతున్నారు?

మామ అల్లుళ్ళ మధ్య అనుబంధాలు, ఎమోషన్స్ హాస్యం తో పాటు భావోద్వేగంగా చెప్పే ప్రయత్నం చేశాం.

 

ఈ చిత్రంలోని వెంకటేష్, చైతు పాత్రలు ఎలా ఉంటాయి?

వెంకటేష్ గారు ఓ పల్లెటూరిలో వెంకట రత్నం అనే పాత్ర చేస్తున్నారు. ఆయన్ని మిలట్రీ నాయుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక చైతు పట్నంలో చదువుకున్న అబ్బాయిగా ఉంటాడు. తరువాత అతను మిలట్రీకి వెళతాడు.

 

చైతూ, వెంకీలలో ఎవరికీ స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ ఉంటుంది ?

 

ఇద్దరికి సమానంగా రోల్ ఉంటుంది. ఒకరికి ఎక్కువ మరొకరి తక్కువ అనే అంశం లేదు.

 

రామానాయుడు డ్రీం ప్రాజెక్ట్ అంటగదా ఎలా డీల్ చేశారు?

నాకు మొదట్లో ఈ సంగతి తెలియదు. సురేష్ బాబు గారు ఓ రోజు ఈ విషయం నాకు చెప్పారు. అది విన్న తరువాత నా బరువు, బాధ్యతలు ఇంకా పెరిగిపోయాయి. అలాగే ఇలాంటి ప్రాజెక్ట్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావించాను.

 

ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్ పాత్రేమిటి ?

పాయల్ ఈ మూవీలో ఓ స్కూల్ టీచర్ రోల్ చేస్తున్నారు. ఆమె ఈ పాత్రకు సరిపోతుందని థమన్ సజ్జెస్ట్ చేశారు. పాయల్ ఆ పాత్రకు చక్కగా సరిపోయారు.

 

వెంకీ మామ చిత్రంలో హైలెట్ అంశం ఏమిటీ?

 

ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ అభిమానం కలిగిన మామా అల్లుళ్ల ఎమోషన్స్ ఈ చిత్రానికి హైలెట్. ఎంతగా నవ్విస్తారో అంతగా ఏడిపిస్తారు కూడా.

సంబంధిత సమాచారం :