ఇంటర్వ్యూ: త్రివిక్రమ్ శ్రీనివాస్- అల్లు అర్జున్ చాలా నిబద్ధత గల నటుడు.

Published on Jan 10, 2020 3:17 pm IST

సంక్రాంతి చిత్రాలలో ఒకటైన అలవైకుంఠపురంలో ఈనెల 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. బన్నీ- త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. విడుదల తేదికి సమయం దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. కాగా నేడు దర్శకుడు త్రివిక్రమ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ విశేషాలు మీ కోసం…

 

ఎన్టీఆర్ తో అరవింద సమేత లాంటి చిత్రం చేయడానికి మీకు ప్రేరణ ఏమిటీ?

అజ్ఞాతవాసి మూవీ పరాజయం తరువాత నా సన్నిహితులు నాకు ఇచ్చిన సలహా మీకు బాగా తెలిసిన ఎమోషనల్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ చేయండి అని. కానీ నన్ను నేను నిరూపించుకోవాలని నా కంఫర్ట్ జోన్ నుండి బయటికి వచ్చి సీరియస్ డ్రామా తెరకెక్కించాను. అది విజయం సాధించింది.

 

అల వైకుంఠపురంలో చిత్రం ప్రేక్షకులకు ఎటువంటి అనుభూతిని ఇస్తుంది?

అల వైకుంఠపురంలో మూవీ చూసి థియేటర్ నుండి బయటకి వచ్చిన ప్రేక్షకుడుకి మంచి సినిమా చూసిన భావన కలుగుతుంది. ప్రేక్షకులకు కావలసిన కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ అన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి.

 

పాటలను సినిమా విడుదలకు చాలా ముందే విడుదల చేశారు కారణం?

 

అవును ప్రేక్షకుల లోకి అలవైకుంఠపురంలో పాటలను తీసుకెళ్లడానికి చాలా శ్రద్ద తీసుకున్నాం. థమన్ స్వరపరిచిన అన్ని సాంగ్స్ ప్రేక్షకులకు బాగా నచ్చాయి. మా ప్రయత్నానికి ఫలితమే ప్రేక్షకులలోని నుండి వస్తున్న రెస్పాన్స్.

 

మీరు రాసే మాటలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి, అది మీకు మాత్రమే ఎలా సాధ్యం?

అందరూ అడిగే ప్రశ్నే ఇది. ఐతే నేను సినిమా కథ అలాగే అందులోని డైలాగ్స్ రాయడానికి ఎక్కడికో ప్రత్యేక ప్రదేశానికి వెళ్ళను. మా ఇంట్లో భార్య పిల్లల మధ్య కూర్చునే రాసుకుంటాను. కథలో భాగంలో సహజంగా అలాంటి మాటలు రాస్తాను.

 

ఎప్పుడూ కుటుంబాలలో ఉండే చిన్న సమస్యలను కథా వస్తువుగా తీసుకుంటారు, అలా కాకుండా ఓ సామజిక సమస్య పై సినిమా తీయొచ్చుగా?

ప్రతి కుటుంబంలో ఉండే సమస్యలు సామాజిక సమస్యలకు ఏమి తక్కువ కాదు. మనం ఇంటికి వెళ్ళగానే పలకరించే కుటుంబ సభ్యులు, వారితో గడిపే క్షణాలు మంచి అనుభూతిని ఇస్తాయి. అందుకే నేను కుటుంబంతో ముడిపడిన కథా చిత్రాలు చేస్తున్నాను.

 

సంక్రాంతికి పెద్ద హీరోల చిత్రాలు పోటీపడుతున్నాయి, దీనిపై మీ అభిప్రాయం?

సంక్రాంతి సీజన్లో అన్ని సినిమాలకు డిమాండ్ ఉంటుంది. అలాగే అల వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు రెండు చిత్రాల ట్రైలర్స్ చూశాను. ఇవి రెండు భిన్న జోనర్స్ కి చెందిన చిత్రాలు. కాబట్టి ఒకదానికొకటి పోటీకాదు.

 

బన్నీతో మూడు సినిమాలు చేశారు, అతనిపై మీ అభిప్రాయం?

గతంతో పోల్చుకుంటే బన్నీ నటనలో మరింత పరిపక్వత వచ్చింది. ఒక సినిమాకు బన్నీ కమిట్ ఐతే, ఇక తింటూ, నిద్రపోతూ కూడా సినిమా గురించే ఆలోచిస్తుంటారు. బన్నీ చాలా నిబద్దత గల యాక్టర్.

 

మరి పాన్ ఇండియా మూవీ ఎప్పుడు చేస్తున్నారు?

నిజం చెప్పాలంటే ప్రస్తుతానికి పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించే కథ నాదగ్గర లేదు. అలాంటి కథ నాకు దొరికినప్పుడు ఖచ్చితంగా హిందీతో పాటు, పలు భాషలలో ఆ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తాను.

 

సంబంధిత సమాచారం :

X
More