ఇంటర్వ్యూ: గెటప్ శ్రీను- జబర్థస్త్ నుండి అందుకే బయటికి వెళ్ళలేదు.

Published on Feb 4, 2020 4:10 pm IST

 

 

ఫేమస్ కామెడీ షో జబర్ధస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ ప్రధాన పాత్రలలో దర్శకుడు అనిల్ కుమార్ జి తెరకెక్కించిన చిత్రం 3మంకీస్. కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈమూవీ ఈనెల 7న విడుదల కానుంది. దీనితో నటుడు గెటప్ శ్రీను మీడియాతో ముచ్చటించారు.

 

అసలు 3 మంకీస్ కథ అందులోని మీ పాత్రల గురించి చెప్పండి?

కష్టనష్టాలలో ఒకరికిరి మరొకరు తోడుగా ఉండే ముగ్గురు మిత్రులు వారి తెలివి తక్కువ పని వలన ఒక సమస్యలో చిక్కుకుంటారు. అసలు ఆ సమస్య ఏమిటీ? ఆ సమస్యను ఎవరు సృష్టించారు? ఈ సమస్య నుండి ఈ ముగ్గురు ఎలా బయటపడ్డారు అనేది మా 3 మంకీస్ కథ. మొదటి సగం అంతా కామెడీ, రెండో సగం సీరియస్ గా ఈ చిత్రం ఉంటుంది.

 

ముగ్గురు మిత్రులు ఒక సినిమాలో కనిపించబోతున్నారు, మీ ఫీలింగ్?
ఏడేళ్లుగా జబర్థస్త్ లో సుధీర్, రామ్ ప్రసాద్ నేను కలిసి వున్నాము. అలాంటి మేము ముగ్గురం కలిసి ఒక సినిమాలో నటించడం గొప్ప ఫీలింగ్. ఐతే మేము ముగ్గురం రాఘవేంద్ర రావు గారు నిర్మించిన ఓం నమో వెంకటేశాయ చిత్రంలో మొదటిసారి ఒకే ఫ్రేమ్ లో కనిపించారు.

 

గెటప్ మీ ఇంటి పేరులా మారిపోయింది, ఈమూవీలో ఏ గెటప్ వేశారు?
ఏ గెటప్ వేయకపోవడమే ఈ చిత్రంలో నా గెటప్ అని చెప్పాలి(నవ్వుతూ). జబర్ధస్త్ వేరు సినిమా వేరు, అక్కడలా పెద్ద పెద్ద గెటప్ లు వేయలేము. నా వయసుకు తగ్గ గెటప్స్ వేయాలి అనుకుంటున్నాను.

 

బుల్లితెరపై పాలిటిక్స్ గురించి మీరు ఏమంటారు?
మన స్వయంకృపరాధం తో వెనకబడిపోయి దానిని పాలిటిక్స్ అంటూ ఉంటాం. నాకు ఎలాంటి పాలిటిక్స్ ఎదురుకాలేదు. ఆ పాలిటిక్స్ టేస్ట్ నాకు తెలియదు.

 

నాగబాబు గారి అదిరింది ప్రోగ్రామ్ కి మిమ్ముల్ని పిలువలేదా?
నాగబాబు గారూ అదిరింది ప్రోగ్రామ్ లో చేయమని అడిగారు. ఐతే శ్యామ్ ప్రసాద్ రెడ్డిగారిపై అభిమానంతో జబర్థస్త్ షో విడిచి వెళ్లలేకపోయాము. ఆర్థికంగా కూడా శ్యాంప్రసాద్ రెడ్డి చాల విషయాలలో సహాయం చేశారు. ఐతే నాగబాబు నా నిర్ణయాన్ని తప్పుబట్టకుండా గౌరవించారు.

 

త్వరలో సోలో హీరోగా చేయనున్నారా?
అంత మాటనకండీ బాబు..(నవ్వుతూ) ఈ సినిమా అయినా వాళ్లిద్దరూ (సుధీర్, రామ్ ప్రసాద్) ఉన్నారని ప్రధాన పాత్ర చేశాను.హీరో అవ్వాలన్న కోరిక నాకు లేదు.పరిశ్రమలో మంచి క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఎదగాలన్నదే నా కోరిక.

 

ప్రస్తుతం ఎవరి చిత్రాలలో నటిస్తున్నారు?
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఫైటర్ మరియు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాతో పాటు గీతా ఆర్ట్స్ వారి అఖిల్ సినిమాలో నటిస్తున్నాను.

సంబంధిత సమాచారం :

X
More