ఇంటర్వ్యూ: తరుణ్ భాస్కర్- పెళ్ళైన ప్రతి ఒక్కరూ అబద్దాలు చెబుతారు.

Published on Oct 26, 2019 5:00 pm IST

పెళ్లి చూపులు చిత్రంతో నేషనల్ అవార్డు విన్నింగ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ మీకు మాత్రమే చెప్తా చిత్రంతో హీరోగా మారాడు. హీరో విజయ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే నెల 1న విడుదల అవుతుంది. దానితో ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

హీరో అవుతారని ఎప్పుడైనా అనుకున్నారా?

అస్సలు అనుకోలేదు. కానీ ఇది మిడిల్ క్లాస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ పాత్ర. కాబట్టి అంత గ్లామర్ గా కూడా కనిపించాల్సిన అవసరం లేదు. నువ్వు ఎలా ఉన్నావో అలా వచ్చేయ్ చాలు అన్నారు. అలా ఈ మూవీకి నేను హీరో ఐపోయాను.

 

ఈమూవీ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది?

దర్శకుడు శామీర్ సుల్తాన్ తమిళంలో అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిలిమ్స్ తీశారు. ఆయన ఈ కథను విజయ్ దేవరకొండకు వినిపిస్తే, ఆయన ఇమేజ్ కి సరిపోదనే కారణంతో స్క్రిప్ట్ వదులుకోలేక నాతో చేయించాలని భావించారు.

 

దర్శకుడిగా ఎదుగుతున్న సమయంలో హీరోగా మారడం మంచిది కాదేమో ?
నా కెరీర్ పట్ల నాకు స్పష్టత ఉంది. నేను కొన్ని సినిమాలకు ఎడిటింగ్ కూడా చేస్తుంటాను. అలాగే కొన్ని తమిళ చిత్రాలకు తెలుగు డైలాగ్స్ రాస్తుంటాను. నా ఫోకస్ డైరెక్షన్ పైనే కానీ అవకాశం వచ్చింది కాబట్టి చేస్తున్నాను.

 

పెళ్లి చూపులు చిత్రంలో విజయ్ గారి బాడీ లాంగ్వేజ్ ఇమిటేట్ చేసినట్టున్నారు?
అలా ఏమి కాదండి. కాకపోతే తెలంగాణా డైలాగ్ డెలివరీ, బాడీలాంగ్వేజ్ అంటే విజయ్ నే గుర్తొస్తారు. అందుకే మీకు అలా అనిపించి ఉండొచ్చు.

 

ఈ మూవీ ద్వారా మీరు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి?
మనిషి ప్రైవసీకీ మొబైల్స్ వలన ఎలా భంగం కలుగుతుంది. దాని వలన వచ్చే సమస్యలేమిటి? వంటి విషయాలు ఎంటర్టైనింగ్ గా చూపించాం.

 

ఒక దర్శకుడిగా ఏమైనా మార్పులు చేర్పులు చేశారా ?

డైలాగ్స్ రాయడం జరిగింది. అలాగే మన నేటివిటీకి తగ్గట్టుగా కొంచెం పాత్రల స్వభావాలు మార్చాను. మూవీ సెట్స్ పైకి వెళ్ళాక నేను కేవలం యాక్టర్ ని మాత్రమే.

 

మ్యూజిక్ డైరెక్టర్ ని ఎవరు ఎంపిక చేశారు?
మ్యూజిక్ డైరెక్టర్ శివ దర్శకుడు శామీర్ సుల్తాన్ ఫ్రెండ్, కావున ఆయనే ఎంపిక చేశారు.

 

దర్శకుడునుండి హీరో అనగానే అందరూ ఏమన్నారు?
చాలా మంది డైరెక్టర్స్ అవ్వాలని, హీరో అవ్వాలని అనుకుంటారు కానీ ఎవరికి చెప్పరు. కానీ నేను అలా కాదు, నేను పక్కనోళ్లు ఏమనుకుంటున్నారో పట్టించుకోరు, నాకు నచ్చింది చేస్తాను.

 

ఈ మూవీలో మీరు అబద్ధాలు చెప్పారు, నిజజీవితంలో చెప్తారా?
నిజ జీవితంలో అందరూ అబద్దాలు చెవుతారు. పెళ్ళైన ప్రతి వారు ఖచ్చితంగా అబద్ధాలు చెబుతారు.

 

పెళ్లి చూపులు చిత్రం అంత విజయం సాధింస్తుందని అనుకూలన్నారా?

అస్సలు అనుకోలేదు. ఆ మూవీ వంద రోజులు ఆడుతుంది, 40 కోట్లు వసూళ్లు సాధిస్తుందని అస్సలు ఊహించలేదు.

 

విజయ్ కాంబినేషన్ లో మూవీ ఎప్పుడు?
ఉంటుంది కానీ, ఆయన ఇమేజ్ తగ్గట్టుగా కథ రాయాలి.నేను రాసిన పాత కథలు విజయ్ ప్రస్తుత స్టార్ డమ్ కి సరిపోవు.

 

వెబ్ సిరీస్ లు ఏమైనా చేస్తారా?
హా చేస్తున్నాను. బిటెక్ అనే ఒక వెబ్ సిరీస్ తో పాటు, ఈ నగరానికి ఏమైంది 2 వెబ్ సిరీస్ లు చేస్తున్నాను.

సంబంధిత సమాచారం :

More