ఇంటర్వ్యూ: రాశి ఖన్నా- రాశి ఇలాంటి పాత్ర ఎందుకు చేసింది అని అందరూ అనుకున్నారు..!

Published on Feb 8, 2020 4:07 pm IST

విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న మరో సెన్సేషన్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్. ఈనెల 14న ప్రేమికుల రోజు కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈనేపథ్యంలో ప్రధాన హీరోయిన్ గా నటించిన రాశి ఖన్నా నేడు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

 

వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో మీ పాత్ర కొంచెం బోల్డ్ గా ఉంటుందా?

అవును ఈ చిత్రంలో నేను బోల్డ్ అండ్ ఛాలెంజింగ్ రోల్ చేశాను. ప్రతి అమ్మాయిలో యామిని క్యారెక్టర్ ఉంటుంది. ఎమోషన్స్ మరియు పర్సన్స్ కి ఎలాంటి గౌరవం ఇవ్వాలి అనేది నా పాత్ర తెలియజేస్తుంది. నా వాస్తవ జీవితానికి దగ్గరగా నా పాత్ర స్వభావం ఉంటుంది.

 

ఈ టైటిల్ మూవీ కి యాప్ట్ అంటారా?
ఖచ్చితంగా వరల్డ్ ఫేమస్ లవర్ అనే టైటిల్ ఈ మూవీకి చక్కగా సరిపోతుంది. అలా ఎందుకు పెట్టారు అనే విషయం నేను చెప్పను గాని, సినిమా చూశాక మీకు అర్థం అవుతుంది.

 

విజయ్ దేవరకొండ తో కలిసిన నటించిన అనుభూతి ఎలా ఉంది?
ఆయనతో కలిసి నటించడం చాలా ఎంజాయ్ చేశాను. ఈ మూవీ తరువాత విజయ్ ఓ థియేటర్ ఆర్టిస్ట్ అని తెలిసింది.అందుకే ఆయనకు నటన పట్ల అంత పట్టు ఉంది అనిపిస్తుంది. విజయ్ అన్ని యాస్పెక్ట్స్ లో పర్ఫెక్ట్ యాక్టర్ అని చెప్పొచ్చు.

 

ఈ సినిమాలో పాత్రలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయని అనిపిస్తుంది?
అవును సినిమాలోని డైలాగ్స్ మరియు పాత్రలతో ప్రేక్షకులు ఇన్వాల్వ్ అవుతారు. అంత ఇంటెన్సిటీ మరియు ఇన్వాల్వ్ మెంట్ ఈ కథలో ఉంటుంది.

 

టీజర్ తరువాత మీ అభిమానుల రియాక్షన్ ఏమిటీ?
టీజర్ తరువాత రాశి ఇలాంటి క్యారెక్టర్ ఎందుకు చేసింది అన్నారు, ఐతే ఎప్పుడూ ఒకే రకమైన పాత్రలు చేయలేం. ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేసినప్పుడే మనల్ని మనం నిరూపించుకోగలం. మూవీ చూసిన తరువాత మీకు అర్థం అవుతుంది నేను ఇలాంటి పాత్ర ఎందుకు ఒప్పుకున్నానో.

 

విజయ్ ఇదే నా లాస్ట్ లవ్ స్టోరీ అంటున్నాడు, మీ అభిప్రాయం?
ఆయన అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. ఐతే కొంత కాలం చేయకపోవచ్చు, కానీ మళ్ళీ ఎప్పుడైనా చేసే అవకాశం కలదు. ఎందుకంటే విజయ్ ని ప్రేమ కథా చిత్రాల్లో చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడతారు.

 

ఈ సినిమాలో అర్జున్ రెడ్డి, డియర్ కామ్రేడ్ ఛాయలు కనిపిస్తున్నాయి అంటున్నారు?

గడ్డం ఉన్నంత మాత్రాన దీనిని అర్జున్ రెడ్డి, డియర్ కామ్రేడ్ తో పోల్చడం సరికాదు. ఇది ఒక డిఫరెంట్ స్టోరీ. సినిమా విడుదల తరువాత మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది

సంబంధిత సమాచారం :

More