మహేష్ 28 ఫస్ట్ గ్లింప్స్ పై ఇంట్రెస్టింగ్ బజ్

Published on May 28, 2023 1:32 am IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ SSMB 28. సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ హైప్ ఏర్పరిచిన ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తదుపరి షెడ్యూల్ జూన్ 7 నుండి జరుపుకోనున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా పీఎస్ వినోద్ ఫోటోగ్రఫి అందిస్తున్నారు. ఇక ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకోగా నిన్న మరొక పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.

ఇక SSMB 28 మూవీ టైటిల్ తో పాటు ఫస్ట్ స్ట్రైక్ గ్లింప్స్ ని సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా మే 31న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అయితే మ్యాటర్ ఏమిటంటే, తాజా టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ గ్లింప్స్ దాదాపుగా ఒక నిమిషం వరకు లెంగ్త్ ఉంటుందని, అలానే గ్లింప్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ మాస్ లుక్స్ అదిరిపోతాయని అంటున్నారు. మొత్తంగా అయితే అందరిలో సూపర్ క్రేజ్ ఏర్పరిచిన ఈ మూవీ ఎంత మేర బాక్సాఫీస్ విజయం అందుకుంటుందో తెలియాలి అంటే రిలీజ్ డేట్ అయిన 2024 జనవరి 13 వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబంధిత సమాచారం :