వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి విషయంలో పలు ఇంట్రెస్టింగ్ పోలికలు …!

వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి విషయంలో పలు ఇంట్రెస్టింగ్ పోలికలు …!

Published on Oct 26, 2022 6:36 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా వాల్తేరు వీరయ్య. మంచి మాస్ యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో చాలా గ్యాప్ తరువాత మెగాస్టార్ చిరంజీవి ఊరమాస్ క్యారెక్టర్ చేస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నారు. మొన్న రిలీజ్ అయిన ఈ మూవీ టైటిల్ టీజర్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక నటసింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా మాస్ యాక్షన్ మూవీ వీర సింహా రెడ్డి.

ఈ మూవీ యొక్క టైటిల్ ని ఇటీవల యూనిట్ గ్రాండ్ ఈవెంట్ లో భాగంగా ప్రకటించింది యూనిట్. ఈ మూవీలో బాలకృష్ణ మాస్ పవర్ఫుల్ రోల్ చేస్తుండగా యువ మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా భారీ స్థాయిలో డైరెక్టర్ బాబీ ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు చెఫ్తోంది యూనిట్. అయితే విషయం ఏమిటంటే అటు వాల్తేరు వీరయ్య, ఇటు వీర సింహారెడ్డి సినిమాల విషయమై కొన్ని ఇంట్రెస్టింగ్ పోలికలు ప్రస్తుతం టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారాయి. ముందుగా ఈ రెండు సినిమాలని టాలీవుడ్ భారీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ గా నిర్మిస్తుండడం విశేషం.

అలానే ఈ రెండు సినిమాల్లో కూడా హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్నారు. ఇక టైటిల్స్ పరంగా చూస్తే వీర అనే పేరుతో మొదలవుతుండడం కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. వాటితో పాటు ఈ రెండు సినిమాలు కూడా కేవలం కొద్దిరోజుల గ్యాప్ లో 2023 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానున్నాయి. మొత్తంగా అటు మెగాస్టార్ వాల్తేరు వీరయ్య, ఇటు బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలు రెండూ కూడా ప్రేక్షకాభిమానుల్లో ఎంతో హైప్ ని ఏర్పరిచాయి. మరి సంక్రాంతి బరిలో నిలవనున్న ఈ మూవీస్ లో ఏది ఏ స్థాయి విజయం అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు