జ్యోతిక కొత్త చిత్రానికి ఇంట్రస్టింగ్ టైటిల్ !

Published on May 1, 2019 1:01 pm IST


వరుస సినిమాల తో కోలీవుడ్ లో ఫుల్ బిజీ అయిపొయింది స్టార్ హీరో సూర్య సతీమణి సీనియర్ హీరోయిన్ జ్యోతిక. అందులో భాగంగా జ్యోతిక ఇటీవల కళ్యాణ్ డైరెక్షన్ లో ఓ చిత్రంలో నటించింది. ఈ చిత్రానికి ‘జాక్ పాట్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. సూర్య సొంత బ్యానర్ 2 డి ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పడి పడి లేచె మనసు ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక జ్యోతిక ప్రస్తుతం దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తున్న చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రంలో కార్తీ హీరోగా నటిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం యొక్క షూటింగ్ స్టార్ట్ అయ్యింది.

సంబంధిత సమాచారం :

More