మరోసారి ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఆర్ఎక్స్100 హీరో !

Published on Apr 26, 2019 3:42 pm IST

మొదటి , రెండు చిత్రాలకు ( ఆర్ఎక్స్100, హిప్పీ) ఇంట్రెస్టింగ్ టైటిల్ ను సెలెక్ట్ చేసుకున్న యంగ్ హీరో కార్తికేయ మరో సారి అదే సెంటిమెంట్ ను కొనసాగించాడు. ఇటీవల హిప్పీ షూటింగ్ ను పూర్తి చేసిన కార్తికేయ ప్రస్తుతం నూతన దర్శకుడు అర్జున్‌ జంధ్యాల దర్శకత్వంలో తన మూడవ చిత్రంలో నటిస్తున్నాడు.

ఇక ఈ చిత్రానికి గుణ 369 అనే టైటిల్ ను ఖరారు చేశారు. జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, స్ప్రింట్‌ టెలీ ఫిలిమ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఆర్ ఎక్స్ 100 తరహాలో వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఈఏడాది ద్వితీయార్థం లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :